Swetha
హీరో వరుణ్ సందేశ్ పేరు వినగానే అందరికి బాగా గుర్తొచ్చే సినిమాలు కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్. ఇక ఇప్పుడు వరుణ్ రీసెంట్ గా నటించిన సినిమా నింద. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సందేశ్.
హీరో వరుణ్ సందేశ్ పేరు వినగానే అందరికి బాగా గుర్తొచ్చే సినిమాలు కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్. ఇక ఇప్పుడు వరుణ్ రీసెంట్ గా నటించిన సినిమా నింద. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సందేశ్.
Swetha
వరుణ్ సందేశ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “నింద”. అయితే ఈ హీరో పేరు వినగానే వెంటనే అందరికి మైండ్ లోకి వచ్చే రెండు సినిమాలు మాత్రం కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్. ఆ రెండు సినిమాలు యూత్ లో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాల ప్రభావమో ఏమో కానీ మళ్ళీ వరుణ్ నుంచి అలాంటి సినిమాలనే ఆశిస్తున్నారు ప్రేక్షకులు. దీనితో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే వరుణ్ ఖాతాలో ఇప్పటివరకు పడలేదని చెప్పి తీరాలి. ఇక రీసెంట్ గా వరుణ్ నటించిన నింద సినిమా కు సంబంధిచి జరిగిన ఓ ఇంటర్వ్యూ లో వరుణ్ కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ముచ్చట్లు చూసేద్దాం.
నింద సినిమాను ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో.. కొన్ని నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా జూన్ 21 న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ టీమ్.. ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అలాగే షూటింగ్ లో వరుణ్ కు ఎదురైనా సమస్యల గురించి ప్రశ్నించగా.. “మరో సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. ఆ వెంటనే నింద షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులంతా రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయి ఉంది. నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక.. రాజేష్ గారి డెడికేషన్, ప్యాషన్ చూసి.. ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ గారి కోసమే ఆ రిస్క్ తీసుకున్నాను.” అంటూ చెప్పుకొచ్చారు సందేశ్.
ఇక ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి కారణం… రొటీన్ కథలు చేసి బోరింగ్ గా అనిపించడమేనని .. అందుకే ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. నింద సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అని ప్రశ్నించగా.. “నిందలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అస్సలు పోలిక ఉండదు. నేను బయట జాలీగా, చిల్‌గా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా సీరియస్‌గా ఉండను. కానీ, ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించాను. ఈ చిత్రంలో ఎంతో సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తాను.”అంటూ సమాధానం ఇచ్చారు. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ ఖాతాలో ఓ హిట్ పడుతుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమా ఎంత మందిని మెప్పిస్తుందో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. జూన్ 21వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.