iDreamPost
android-app
ios-app

4 కొత్త సినిమాలతో ఓటిటి ట్రీట్

  • Published Dec 06, 2022 | 3:56 PM Updated Updated Dec 06, 2022 | 3:56 PM
  • Published Dec 06, 2022 | 3:56 PMUpdated Dec 06, 2022 | 3:56 PM
4 కొత్త సినిమాలతో ఓటిటి ట్రీట్

ప్రతి వారం లాగే ఈ శుక్రవారం కూడా ఓటిటి ఫ్యాన్స్ కోసం కొత్త కంటెంట్ రెడీ అవుతోంది. థియేటర్లతో సమానంగా కొత్త రిలీజులు ఇచ్చేందుకు డిజిటల్ సంస్థలు పోటీ పడుతుండటంతో మూవీ లవర్స్ కు ఇల్లు కదలకుండానే మంచి వినోదం అందుతోంది. డిసెంబర్ 9న వచ్చే వాటిలో మొదటిది యశోద. అమెజాన్ ప్రైమ్ లో ముందు రోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది. సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ మెడికల్ మాఫియా చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ కొన్ని మెయిన్ సెంటర్స్ రన్ అవుతున్నప్పటికీ ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ముప్పై రోజుల కంటే ముందుగానే స్మార్ట్ స్క్రీన్ కు రానుంది.

అనారోగ్యరిత్యా సామ్ మీద పనిచేసిన సానుభూతి ఇక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రెండోది ఊర్వశివో రాక్షసివో. అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఒకేసారి ఆహా, నెట్ ఫ్లిక్స్ లో రానుంది. దీనికి రివ్యూస్ పాజిటివ్ గా వచ్చి యూత్ సపోర్ట్ దక్కినా థియేటర్లలో మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది. అల్లు అర్జున్ అతిధిగా చేసిన సక్సెస్ మీట్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఆడియన్స్ ని థియేటర్ ఫుల్ చేసే కెపాసిటీ లేకపోవడంతో శిరీష్ కు ఈ ఫలితం తప్పలేదు. సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లాల లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదే రోజు సోనీ లివ్ లో కనువిందు చేయనుంది. ఇది మెగా డిజాస్టర్

అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంని జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా అదే డేట్ లాక్ చేసుకుందట. అఫీషియల్ ప్రకటన రాలేదు. మంచి కాన్సెప్ట్ తో సోషల్ మెసేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరస్కారాన్ని ఎదురుకుంది. అల్లరోడి నటన ఎంత బాగున్నప్పటికీ సరిగా పండని డ్రామా జనాన్ని మెప్పించలేకపోయింది. దీంతో నాంది రేంజ్ లో ఆడుతుందని ఆశలు పెట్టుకున్న నరేష్ కు ఫ్లాప్ తప్పలేదు. ఇవి కాకుండా ఇతరత్రా వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ డిసెంబర్ 9న గట్టిగానే రాబోతున్నాయి. థియేటర్లలో 11 సినిమాలు, ఓటిటిలో ఇంతేసి వినోదం ఉంటే ఇంతకంటేకావాల్సింది ఏముంటుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss