iDreamPost
android-app
ios-app

Telugu OTT ఈ వారం ఓటీటీ ద‌ద్ధ‌రిల్ల‌డం ఖాయం, థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలివే

  • Published May 16, 2022 | 6:34 PM Updated Updated May 16, 2022 | 6:34 PM
  • Published May 16, 2022 | 6:34 PMUpdated May 16, 2022 | 6:34 PM
Telugu OTT ఈ వారం ఓటీటీ ద‌ద్ధ‌రిల్ల‌డం ఖాయం, థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలివే

ఈ వారం సినీ అభిమానులకు, ఓటీటీ ప్రేక్షకులకు పండగే. ఈ వారంలో భారీ సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతుండగా, థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ వారం స్ట్రీమ్ కానుంది. హిందీ మినహా మిగతా భాషల్లో జీ5 ఓటీటీలో RRR సినిమా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విజువల్ వండర్ ను ఇక ఇంటిల్లిపాది కూర్చుని చూసేయొచ్చు.

ఈవారం ఓటీటీలో విడుదల కాబోతున్న మరో పెద్ద హీరో సినిమా ఆచార్య(Acharya OTT). తండ్రీకొడుకులు చిరంజీవి – చరణ్ లు కలిసి నటించిన ఈ సినిమా ఊహించిన అంచనాలను అందుకోలేక 20 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఆచార్య కూడా మే 20నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ఈ హీరో నటించిన తాజా చిత్రం భళా తందనాన మే6వ తేదీన థియేటర్లలో విడుదలై ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ నటించింది. ఈ సినిమా మే 20వ తేదీ నుంచి disney plus hotstarలో ప్రసారం కానుంది.

మే 20వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న మరో సినిమా 12th Man. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ది కీలక పాత్ర. వీరి కాంబినేషన్లో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 (మళయాళం) సూపర్ హిట్ అయ్యాయి. మరోసారి వీరికాంబినేషన్లో మిస్టరీ థ్రిల్లర్ వస్తుండగా.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవిత దర్శకత్వంలో రూపొందిన శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మళయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ మూవీకి రీమేక్ గా తెలుగు శేఖర్ ను తీశారు. ఈ సినిమాలో రాజశేఖర్ వయసు మీదపడిన వ్యక్తిగా కొత్తలుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు పెట్టుకుంది.

చాలాకాలానికి సంపూర్ణేష్ బాబు థియేటర్లలో సందడి నవ్వులు పూయించేందుకు వస్తున్నాడు. సంపూర్ణేష్, సోనాక్షి జంటగా వస్తున్న సినిమా ధగడ్ సాంబ(dhagad samba). ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి, తదితరులు ఈ సినిమాలు నటించారు.

బాలీవుడ్ క్వీన్ కంగన్ రనౌత్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ధాకడ్(Dhaakad ) కూడా ఈ వారమే విడుదలవుతోంది. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో రూపొందిన ధాకడ్ లో కంగనా ఏజెంట్ అగ్నిగా కీలక పాత్ర పోషించింది. మే 20న థియేటర్లలో విడుదల. ఈ వారమే విడుదలవుతోన్న మరో బాలీవుడ్ సినిమా భూల్ భులాయా 2(bhool bhulaiyaa 2). కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణి జంటగా.. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమా కూడా మే 20నే థియేటర్లలో విడుదల కానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet