వీడియో: కూతురితో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన!

దేశంలో జరుపుకునే పెద్ద పండుగల్లో దసరా ఒకటి. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటారు ప్రజలు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద యెత్తున దసరా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పేరుతో పూజలు చేపడుతుంటారు.

దేశంలో జరుపుకునే పెద్ద పండుగల్లో దసరా ఒకటి. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటారు ప్రజలు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద యెత్తున దసరా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పేరుతో పూజలు చేపడుతుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు అంబరాలను తాకుతున్నాయి. పిల్లలకు దసరా సెలవులు కావడంతో పాటు పెద్దలకు కూడా వరుసగా మూడు, నాలుగు రోజుల పాటు హాలీడేస్ రావడంతో స్వస్థలాలకు చేరుకున్నారు. ఎటు చూసినా పండుగ వాతావరణం నిండుగా కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో విజయదశమిని ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అదేవిధంగా తెలంగాణలో ఈ పండుగా చాలా ప్రత్యేకం. బతుకమ్మను పేర్చి.. ఆమె చుట్టూ.. నృత్యాలు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన సాంప్రదాయ పద్ధతుల్లో నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు.

రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. వాటి చుట్టూ చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతారు మహిళలు. ఒక కుటుంబలోని మహిళలే కాకుండా.. ఆ ఇరుగు,పొరుగు ఇళ్లల్లో ఉండే వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బొడ్డెమ్మతో, ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మలు చేసి.. నృత్యాలు చేసి.. వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంతో సందడిగా సాగిపోతుంది. బతుకమ్మను ఇంటి ఇలవేల్పుగా కొలిచి పూజిస్తుంటారు తెలంగాణ ప్రజలు. ఇక సెలబ్రిటీలు సైతం దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఇంట కూడా పండుగను చేసుకుంటున్నారు. అయితే ఈ సారి వారి ఇంట్లో ఆనందాలు వెల్లువిరిసిన సంగతి విదితమే.

ఈ ఏడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వీరూ మెగాస్టార్ ఇంట్లో ఉంటున్నారు. దసరా పండగ పురస్కరించుకుని చిరంజీవి ఇంట్లో బతుకమ్మ ఆడారు ఉపాసన, పలువురు. ఎప్పుడూ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. గొప్ప మనస్సు చాటుకుంటారు ఉపాసన. ఈ సారి దసరా పండుగకు కేవలం బంధువులతోనే కాకుండా అనాధ శరణాలయానికి చెందిన పిల్లలతో కలిసి.. తన మామ ఇంట్లోనే పండుగ చేసుకున్నారు ఉపాసన, చరణ్ దంపతులు. ఆ వీడియోను షేర్ చేసుకున్నారు ఉపాసన. ఇందులో తన కుమార్తె క్లింకారాతో కలిసి కనిపించింది ఉప్స్.

పాపను ఎత్తుకుని బతుకమ్మ ఆడింది. బాలికా నిలయం సేవా సమాజ్‌తో కలిసి ఈ పండుగను చేసుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు సాయి తేజ్ కూడా పాల్గొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలాంటి గొప్ప పనులు ఎలా చేయగలుగుతారండీ.. చాలా స్ఫూర్తివంతంగా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. గతంలో ఈ  అనాథ ఆశ్రమానికి వెళ్లి..వారితో గడిపింది ఉపాసన.

Show comments