iDreamPost
android-app
ios-app

ప్రవళిక కేసులో ట్విస్ట్‌.. తల్లి సంచలన ఆరోపణలు!

ప్రవళిక కేసులో ట్విస్ట్‌.. తల్లి సంచలన ఆరోపణలు!

గ్రూపు-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌ చేటుచేసుకుంది. ‍ప్రవళిక శివరామ్‌ రాథోడ్‌ అనే వ్యక్తిని ప్రేమించిందని, వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు మీడియా ప్రతినిధుల సమాశంలో తెలిపారు. ప్రియుడు వేరే యువతితో పెళ్లికి సిద్ధపడటంతో ప్రవళిక తట్టుకోలేకపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆయన వెల్లడించారు. అయితే.. ప్రవళిక తల్లి విజయ.. కూతురి ప్రియుడు శివరామ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

తాజాగా, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూలీ నాలీ చేసుకుంటూ కూతుర్ని చదివించుకుంటున్నానని చెప్పారు. శివరామ్‌ వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తన కూతురుకు న్యాయం జరగాలన్నారు. అతడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. తన కూతురు ఉరి వేసుకుని తనను తాను ఎలా శిక్షించుకుందో.. శివరామ్‌ను కూడా అలాగే శిక్షించాలని అన్నారు. అతడికి  ఉరి శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. తమ కూతురి మరణాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని, రాజకీయాలు చేయోద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రవళిక ఆత్మహత్య చేసుకోవటానికి గ్రూపు-2 పరీక్షలు వాయిదా పడ్డమే కారణమని ప్రచారం జరిగింది.  ఈ ప్రచారంపై డీసీపీ క్లారిటీ ఇచ్చారు. ప్రవళిక మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్పష్టం చేశారు. ప్రవళిక రాసిన సూసైడ్‌ నోట్‌ను ల్యాబ్‌కు పంపామన్నారు. దర్యాప్తు ఓ కొలిక్కి వస్తే శివరామ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి, తన కూతురి మరణాన్ని రాజకీయం చేయొద్దంటున్న ప్రవళిక తల్లి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.