iDreamPost
android-app
ios-app

మహిళా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TSRTC!

  • Published Aug 18, 2023 | 9:33 PM Updated Updated Aug 18, 2023 | 9:33 PM
  • Published Aug 18, 2023 | 9:33 PMUpdated Aug 18, 2023 | 9:33 PM
మహిళా ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TSRTC!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)మహిళా ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని మహిళల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు TSRTC తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగానే TSRTC ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ బస్సులు ఈ నెల 21 నుంచే రోడ్లపైకి రానున్నాయని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న నగరంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆఫర్ ఏంటి? ఇందులో మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే?

TSRTC ఎండీ సజ్జనార్ ట్విట్ చేస్తూ.. మహిళల కోసం ఈ స్పెషల్ బస్సులను కోఠి-కొండాపూర్ మార్గంలో నడపనున్నాం. 127Kనంబర్ గల ప్రత్యేక బస్సు ఈ నెల 21 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి. లక్దికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. ఇక తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది అంటూ TSRTC ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ క్రేజ్‌ అంటే ఇది.. BRSలో మరో పార్టీ విలీనం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet