iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో విషాదం.. తొలి సినిమా విడుదలకు ముందే.. గుండెపోటుతో యువ నటుడు మృతి!

  • Published Jul 01, 2023 | 12:58 PM Updated Updated Jul 01, 2023 | 12:58 PM
  • Published Jul 01, 2023 | 12:58 PMUpdated Jul 01, 2023 | 12:58 PM
టాలీవుడ్‌లో విషాదం.. తొలి సినిమా విడుదలకు ముందే.. గుండెపోటుతో యువ నటుడు మృతి!

అతడికి సినిమాలంటే పిచ్చి.. ఎప్పటికైనా సరే.. వెండి తెర మీద రాణించాలని.. సిల్వర్‌ స్క్రీన్‌ మీద తన పేరు చూసుకోవాలని.. తన నటనను చూసి ప్రేక్షకులు ఈలలు వేయాలని భావించాడు. అయితే సినిమా ఇండస్ట్రీ అనే రంగుల లోకంలో రాణించడం.. అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులువు కాదు. ఎందరో సినిమాల్లో రాణించాలని.. ఎన్నో ఆశలతో వచ్చి.. అవి నెరవేరక.. మనసు చంపుకుని.. వేరే రంగాల్లో స్థిరపడతారు. కొందరిని మాత్రమే అవకాశం వరిస్తుంది. చిన్నదో పెద్దదో పాత్రలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. తమలోని కళాకారుడిని వెలికి తీసే అవకాశం కోసం ఓపికగా ఎదురు చూస్తారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడి విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత వెండి తెర మీద తనను తాను చూసుకునే అవకాశం లభించింది. కానీ విధి రాత మరోలా ఉంది. వెండితెర మీద వెలిగిపోవాలనే అతడి కోరికైతే నెరవేరింది కానీ.. తనను తాను స్వయంగా తెర మీద చూసుకునే అదృష్టం లేకుండా పోయింది. తాను నటించిన తొలి సినిమా విడుదలకు ముందే ఆ యువనటుడు మృతి చెందాడు. ఆ వివరాలు..

టాలీవుడ్‌ యువనటుడు హరికాంత్‌ శనివారం మృతి చెందాడు. గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచాడు. హరికాంత్‌కు సినిమాల్లో నటించాలని బలమైన కోరిక. ఈ క్రమంలో అతడు యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నాడు. మంచి థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ తీస్తోన్న ‘కీడా కోలా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులో హరికాంత్‌ కీలకపాత్రలో నటించాడు. కొద్ది రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కానీ ఈలోపే హరికాంత్‌.. హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.

నటుడు హరికాంత్.. స్వతహాగా థియేటర్ ఆర్టిస్టు. అలా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో వచ్చాడు. ప్రస్తుతం ‘కీడా కోలా’లో ఓ కీలక పాత్రలో చేస్తున్నాడు. టీజర్‌లో అతడికి సంబంధించిన షాట్ మనం చూడొచ్చు. త్వరలోనే వెండితెర మీద తనను తాను చూసుకుంటానని సంతోషంగా ఉన్న సమయంలో.. ఉన్నట్లుండి శనివారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు హరికాంత్‌. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్ఓ ఒకరు ట్వీట్ చేశారు. ఈ క‍్రమంలోనే అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటున్నారు. ఇన్నాళ్లు దేని కోసమైతే కష్టపడ్డాడో.. ఆ ఫలితాన్ని అందుకునేలోపే కన్ను మూయడం విషాదం అంటున్నారు.

marsbahis girişjojobet