iDreamPost
android-app
ios-app

కుమారుడికి అంత్యక్రియలు చేసిన తల్లి!

కుమారుడికి అంత్యక్రియలు చేసిన తల్లి!

ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించినది మరొకటి లేదు. బిడ్డ కోసం తల్లి ఎన్నో త్యాగాలు చేస్తోంది. తాను ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డలను పెంచి.. పెద్ద చేస్తూంది. అలానే బిడ్డలను ఓ ఇంటి వారిని  చేసి.. వారు సంతోషంగా ఉంటే తాను సంతోషిస్తుంది. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. ఆత్మహత్య చేసుకుంటే ఏ తల్లి భరించలేదు. అంతే కాక ఏ తల్లికి రాని కష్టం ఓ తల్లికి వచ్చింది. తనకు తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి ఆమె పెట్టింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన నామాల వెంకటస్వామి(35) అనే వ్యక్తి అటవీశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు వృత్తిరీత్య కామారెడ్డి పట్టణంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతడికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు సోదరిమణులు ఉన్నారు. వెంకట స్వామి తండ్రి గతంలో మరణించారు.  భార్య పిల్లలతో కలిసి వెంకటస్వామి కామారెడ్డి పట్టణంలో  ఉంటున్నాడు. పెళ్లైన తరువాత చాలా కాల పాటు వెంకటస్వామి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

Mother funeral to son

ఈ క్రమంలోనే గత శనివారం వెంకటస్వామికి భార్యతో గొడవ జరిగింది. దీంతో  అతడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు.  సోమవారం ఉదయం చికిత్స పొందుతూ  వెంకట స్వామి మృతిచెందాడు. దీంతో మంగళవారం వెంకటస్వామి స్వగ్రామమైన రామారెడ్డిలో అంత్యక్రియలు నిర్వహించారు. కానీ అంత్యక్రియలకు మృతుడి భార్య హాజర కాలేదు. దీంతో చేసేదేమి లేక వెంకట స్వామి తల్లి నామాల లక్ష్మి కొరివి పెట్టాల్సి వచ్చింది. తల్లి.. కొడుక్కి తలకొరివి పెట్టడం స్థానికులను కలిచివేసింది. మరి..  ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş