iDreamPost
android-app
ios-app

గ్రూప్ 01 దరఖాస్తుకు నేడే లాస్ట్ డే

  • Published Jun 04, 2022 | 11:26 AM Updated Updated Jun 04, 2022 | 11:26 AM
  • Published Jun 04, 2022 | 11:26 AMUpdated Jun 04, 2022 | 11:26 AM
గ్రూప్ 01 దరఖాస్తుకు నేడే లాస్ట్ డే

గ్రూప్‌-1 దరఖాస్తుకు గడువు సమీపిస్తోంది. మొత్తం 503 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల కాగా.. మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 04వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు మాత్రమే దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందని TSPSC వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలుత మే 31 వరకు చివరి తేదీ ప్రకటించారు. కానీ ఆన్ లైన్ లో ఉండడం పలు సమస్యలు ఎదురయ్యాయి.

జూన్ 04వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. శుక్రవారం నాటికి 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. 18 విభాగాల్లోని 503 పోస్టులకు చివరి రోజు భారీగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 312 పోస్టులకు గ్రూప్ –1 నోటిఫికేషన్​ ఇవ్వగా.. అప్పట్లో 3లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే మూడున్నర లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి తేదీ జూన్ 04వ తేదీ నాటికి నాలుగు లక్షలకు చేరుకొనే అవకాశం ఉందని సమాచారం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş