iDreamPost
android-app
ios-app

పెండ్లి దుస్తులతో పరీక్ష రాసిన నవ వధువు.. ఫోటో వైరల్!

పెండ్లి దుస్తులతో పరీక్ష రాసిన నవ వధువు.. ఫోటో వైరల్!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని యువతి యవకులు ఎన్నో కలలు కంటారు. అయితే ఈ పెళ్లి అనేది కొందరు పెద్దల అంగీకారంతో చేసుకుంటారు. మరికొందరు ప్రేమించి.. ఇంట్లో నుంచి పారిపోయి చేసుకుంటారు. అంతేకాక పెళ్లిళ్ల విషయాల్లో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. కొందరు వధువువరులు పెళ్లి దుస్తుల్లోనే ఓటింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అలానే తాజాగా ఓ యువతి కూడ పెళ్లి దుస్తుల్లో పరీక్ష కేంద్రంకి వచ్చి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ నవ వధువుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ పట్టణంలోని భర్మప్ప నగరకు చెందిన సత్యవతి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. అక్కడే ఆ యువతి ఓ ప్రవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. చెన్నైకి చెందిన ఫ్రాన్సిస్‌ అనే యువకునితో ఆమెకో ఆమెకు రెండేళ్ల కిందట సోషల్‌ మీడియాలో పరిచయమై ఏర్పడింది. ఆ తరువాత చాటింగ్ లు చేసుకుంటూ వారి స్నేహం బాగా బలపడింది. వారిద్దరి పరిచయం కాస్తా చివరకు ప్రేమగా మారింది. చాలాకాలం ఇద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. చివరకు ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి సోమవారం ఉదయం వారి గ్రామంలోనే పెళ్ళి చేసుకున్నారు.

 అయితే యువతి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. పెళ్లి రోజున వధువుకు బీఏ చివరి ఏడాది పరీక్ష ఉండడంతో తాళి కట్టడం పూర్తి కాగానే పరీక్షలకు బయలు దేరింది. భర్తతో కలిసి బైక్‌పై కాలేజీకి చేరుకుని పరీక్ష రాసింది. తరువాత పెళ్లి మండపానికి చేరుకుని మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువుపై ఆ యువతికి ఉన్న నిబద్ధతకు అందరు ప్రశంసలు కురిపించారు.  మరి.. ఈ నవ వధువుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet