iDreamPost
android-app
ios-app

పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తగ్గనున్న భారం! విద్యాశాఖ కీలక ఆదేశం..

  • Published May 26, 2024 | 4:40 PM Updated Updated May 26, 2024 | 4:40 PM

ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగడంతో విద్యార్థులు సమ్మార్‌ హాలిడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే మరి కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విద్యాశాఖ 2024–25 అకడమిక్​ ఇయర్​ క్యాలెండర్‌ను శనివారం రిలీజ్‌ చేసింది. కాగా, అందులో ఇకపై స్కూల్‌ పిల్లలకు ఇది కూడా తప్పనిసరి అని విద్యాశాఖ పేర్కొంది.

ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగడంతో విద్యార్థులు సమ్మార్‌ హాలిడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే మరి కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విద్యాశాఖ 2024–25 అకడమిక్​ ఇయర్​ క్యాలెండర్‌ను శనివారం రిలీజ్‌ చేసింది. కాగా, అందులో ఇకపై స్కూల్‌ పిల్లలకు ఇది కూడా తప్పనిసరి అని విద్యాశాఖ పేర్కొంది.

  • Published May 26, 2024 | 4:40 PMUpdated May 26, 2024 | 4:40 PM
పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తగ్గనున్న భారం! విద్యాశాఖ కీలక ఆదేశం..

ఇప్పుడు సమ్మార్‌ సీజన్‌ పాఠశాలలు సెలవు  కావడంతో విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక ఈ వేసవి సెలవులు అనంతరం మరి కొన్ని రోజుల్లో అనగా జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.ఇక విద్యార్థులంతా ఈ వేసవి సెలవులను ముగించుకొని తిరిగి విద్యా సంస్థలకు హాజరుకావల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే.. తాజాగా 2024–25 అకడమిక్​ ఇయర్​ క్యాలెండర్‌ను శనివారం రిలీజ్‌ చేసింది. కాగా, అందులో ఇకపై స్కూల్‌ పిల్లలకు ఇది కూడా తప్పనిసరి అనిఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం  ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 229 రోజులు వర్కింగ్​ డేస్​గా నిర్ణయించారు. దీంతో దసరా సెలవులు 13 రోజులు, క్రిస్మస్​, సంక్రాంతికి ఐదు రోజుల చొప్పున సెలవులు ఇవ్వనున్నారు. దాంతో పాటు స్కూళ్లలో ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆ క్యాలెండర్‌లో  పేర్కొన్నారు. దీంతో పాటు ప్రేయర్​ కు ముందుగానీ, ప్రేయర్​ అయ్యాక క్లాసులో కానీ, ఐదు నిమిషాల పాటు విద్యార్థులతో యోగా మెడిటేషన్​ చేయించాలని సూచించారు. దీంతో పాటు ప్రతి నెలా మూడో శనివారం విధిగా నో బ్యాగ్​ డేని అమలు చేయాలని, మొత్తంగా విద్యాసంవత్సరంలో పది నో బ్యాగ్​ డేలను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు.

Doctors

వీటితో పాటు ముఖ్యంగా అన్ని స్కూళ్లూ విద్యార్థులకు రెగ్యులర్​గా హెల్త్​ చెకప్​లను చేయించాలని  ఆ అకాడమిక్​ క్యాలెండర్​లో పేర్కొన్నారు. అయితే ప్రైమరీ హెల్త్​ సెంటర్​ (పీహెచ్​సీ)ల నిపుణులతో విద్యార్థులకు చెకప్​లు చేయించి,  రిఫరల్​ కేసులుంటే స్థానిక ఏరియా ఆస్పత్రులకు పంపించాలని సూచించారు. ఇక విద్యార్థులకు నిర్వహించే ఈ హెల్త్‌ చెకప్‌ అనేది ఏటా రెండుసార్లు కచ్చితంగా  చేయించాలని, అందుకు హెడ్​మాస్టర్లు కో ఆర్డినేట్​ చేయాలని పేర్కొన్నారు. దీంతో పాటు క్యుములేటివ్​ రికార్డ్స్​ కింద ఇప్పటికే ప్రింట్​ చేసిన విద్యార్థుల హెల్త్​ కార్డులను ప్రాపర్​గా మెయింటెయిన్​ చేయాలని అందులో చెప్పుకొచ్చారు.

ఇక  పదో తరగతి సిలబస్​ను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని, బోర్డు ఎగ్జామ్స్​కు విద్యార్థులను ప్రిపేర్​ చేసేలా రివిజన్​, ప్రీ ఫైనల్​ ఎగ్జామ్స్​ను కండక్ట్​ చేయాలని సూచించారు. అలాగే ఒకటి నుంచి తొమ్మిదో క్లాస్​ వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్​ను కంప్లీట్​ చేసేలా అకాడమిక్​ క్యాలెండర్​ను రూపొందించారు. అందుకోసం విద్యార్థుల హాజరు శాతం పడిపోకుండా స్కూళ్లు చూసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రతి స్కూల్​లోనూ 90 శాతానికిపైగా విద్యార్థుల అటెండెన్స్​ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ప్రతి రోజూ అరగంట పాటు రీడింగ్​ యాక్టివిటీకి టైం కేటాయించాలని, స్కూల్​ బుక్స్​తో పాటు స్టోరీ బుక్స్​, న్యూస్​ పేపర్లు, మ్యాగజైన్లను చదివించాలని పేర్కొంది.

 

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique