2 కోట్లకు పైగా సిమ్ కార్డుల రద్దు చేయనున్న కేంద్రం.. ఎందుకంటే.?

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో ఎవరో ఒకరు దీని బాధితులవుతున్నారు. జనవరి 2023 నుండి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో దాదాపు 1 లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటికి చెక్ పెట్టేందుకు..

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లో ఎవరో ఒకరు దీని బాధితులవుతున్నారు. జనవరి 2023 నుండి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో దాదాపు 1 లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటికి చెక్ పెట్టేందుకు..

ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. మన డబ్బును మనకు తెలియకుండానే కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఒక్క క్లిక్కుతో హాం ఫట్ స్వాహా చేస్తున్నారు. ఈ సైబర్ క్రైంలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఈ మోసాలకు కారణమైన ఫోన్లు, సిమ్ కార్డులపై దృష్టిసారిస్తోంది. నకిలీ డాక్యుమెంట్లతో లేదా సైబర్ క్రైమ్ చేయాలన్న దురుద్దేశంతో తీసుకున్న సిమ్ కార్డుల రద్దు దిశగా అడుగులు వేస్తుంది. ఇదే కనుక నిజమైతే.. 2.17 కోట్ల సిమ్ కార్డులు డిస్ కనెక్ట్ కానున్నాయి. అలాగే 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్‌కు టెలికాం శాఖ తెలియజేసిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాం శాఖ (డాట్) ముఖ్యమైన సమాచారం అందించింది. ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సీబీఐ, ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కాంబోడియా కేంద్రంగా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. 5 వేల మందికి పైగా ఇండియన్స్ ఆ దేశంలో చిక్కకున్నారని, ఇష్టానికి విరుద్దంగా అక్కడ వారిని బంధించారని, సైబర్ నేరాలు చేయాలని బలవంతం చేస్తున్నారని టెలికాం శాఖ చెబుతుంది. భారతీయులను పావులుగా వాడుకుని మార్చి నాటికి 500 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డారని అంచనా వేసింది.

డేటా ఎంట్రీ పోస్టులకు భారీగా వేతనాలు ఆశజూపి, సైబర్ నేరాలు చేయిస్తున్నారు. టెలీ కాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలొస్తున్నాయంటూ మభ్య పెట్టి మోసానికి పాల్పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఓ ప్యానెట్ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమ్మిగ్రేషన్,టెలికాం రంగాల్లో లోపాలను ఈ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్ బ్లాక్ చేయాలని మేలోనే టెలికాం ఆపరేటర్లను డాట్ ఆదేశించింది. అలాగే 35 శాతం ఇన్ కమింగ్ అంతర్జాతీయ కాల్స్ తొలగిస్తామని, ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా అమల్లోకి తెస్తామని తెలిపింది. అలాగే సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సిమ్ కార్డులు జారీ చేసే సమయంలో నో యువర్ కస్టమర్ (కైవేసీ)ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తిగా అమల్లోకి తీసుకు రానుంది మంత్రిత్వ శాఖ. దీంతో నకిలీ పత్రాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు తేలిన 2.17 కోట్ల సిమ్ కార్డులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. అలాగే 2.26 లక్షల మొబైల్స్ రద్దు చేయనుంది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని స్కాం చేస్తున్న రోమింగ్ ఫోన్ నంబర్లను గుర్తించడానికి హాంకాంగ్, కాంబోడియా, లావోస్, పిలిప్పీన్, మయన్మార్ వంటి దేశాల్లో నివసిస్తున్న భారతీయ మొబైల్ నంబర్లకు డేటాను అందించాలని అన్ని టెలికం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించి టెలికాం శాఖ. మరీ ఈ చర్యలతో సైబర్ నేరాలు తగ్గుముఖం పడతాయని అనుకుంటున్నారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments