iDreamPost
android-app
ios-app

‘YS జగన్ మళ్లీ సీఎం కావాలి’… తెలంగాణ బిడ్డ సాహస యాత్ర!

‘YS జగన్ మళ్లీ సీఎం కావాలి’… తెలంగాణ బిడ్డ సాహస యాత్ర!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హీరోలకు మించి సీఎం జగన్ కి అభిమానులు ఉన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులంత జగన్ వెంట నిలబడ్డారు. అలానే జగన్ వ్యక్తిత్వం, పట్టుదల చూసి ఎంతో మంది.. ఆయకు అభిమానులుగా మారారు. సీఎం జగన్ కి కేవలం ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణతో పాటు ఇతర సౌత్ రాష్ట్రాల్లో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ఆయన సీఎం కావాలంటూ అభిమానులు తిరుమలకు పాదయాత్ర చేశారు. అలానే అనేక రకాల కార్యక్రమాలు చేశారు. తాజాగా ఓ అభిమాని.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలంటూ తెలంగాణ నుంచి తాడేపల్లి వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా బచ్చన పేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లకు వీరాభిమాని. రాష్ట్రం విడిపోయినా కూడా తెలంగాణ నేతల కంటే వైఎస్ కుటుంబాన్ని ప్రవీణ్ ఎక్కువగా అభిమానించే వాడు. గతంలో జగన్ సీఎం కావాలని ఎన్నో కార్యాక్రమాలు, పూజలు చేశాడు. తాజాగా సీఎం జగన్‌ రెండోసారి కూడా సీఎం కావాలని కోరుతూ ప్రవీణ్ సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఈనెల 21న ఆయన స్వగ్రామంలోని దేవాలయంలో టెంకాయ కొట్టి.. సైకిల్ యాత్ర ప్రారంభించారు. జనగామ నుంచి తాడేపల్లి వరకు ప్రవీణ్ సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఈనేపథ్యంలో తాజాగా సోమవారం ప్రవీణ్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది.

సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు ప్రవీణ్ చేరుకున్నాడు. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను పలకరించగా.. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తెలిపాడు. ప్రజల, దేవుడి ఆశీస్సులతో ఆయన తప్పకుండా మరోసారి విజయం సాధిస్తారని తెలిపారు. మరి.. తాడేపల్లి చేరుకున్న తరువాత ఈ వీరాభిమానికి జగన్ ను కలిసే అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి. మరి.. ఇలా ఏపీ సీఎం కోసం తెలంగాణ రాష్ట్ర వాసి యాత్ర చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio