iDreamPost
android-app
ios-app

ప్రభుత్వాన్ని మోసం చేయడం చిన్న పొరపాటా? ఇదెక్కడి లాజిక్ అశోక్ బాబూ?

ప్రభుత్వాన్ని మోసం చేయడం చిన్న పొరపాటా? ఇదెక్కడి లాజిక్ అశోక్ బాబూ?

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు తలపండిన రాజకీయ విశ్లేషకులకు సైతం ఏ మాత్రం అర్థం కాని విధంగా మారింది. సాధారణంగా ఏ పార్టీ అయినా తమ పార్టీ నేతలు ఏదైనా తప్పుడు వ్యవహారంలో అయినా అరెస్ట్ అయితే మా వాళ్ళు తప్పు చేయలేదు, నిజంగా తప్పు చేసినట్లు తేలితే పార్టీ నుంచి బహిష్కరిస్తాం అన్నట్లు మాట్లాడుతూ ఉంటాయి. నిజంగా తప్పు అని తేలితే బహిష్కరిస్తారో లేదో అనే సంగతి పక్కన పెడితే ముందుగా జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా మా పార్టీ నేత ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కానీ టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ వ్యవహారంలో ఇదే విషయం తెర మీదకు వచ్చింది. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన అశోక్ బాబు ప్రమోషన్ విషయంలో బీకాం చదివినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు సీఐడీ విభాగానికి ఫిర్యాదు అందింది.

దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అశోక్ బాబుని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది. అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ నేతలు కొంతమంది నిరసనకు దిగారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ తమ నేత నిజంగా తప్పుచేసి ఉంటే చర్యలు తీసుకుంటాం అని అనడం మానేసి “ఏ తప్పూ చేయని అశోక్ బాబు గారి గురించి అనే ముందు, మీ వాళ్ళు అలాగే ఉన్నారని చెబుతూ  ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారి విద్యార్హత గురించి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెద్ద పోస్ట్ పెట్టారు. నిజంగా కనుక వారు పేర్కొన్న విధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే విద్యార్హతల మీద అనుమానాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు, లేకపోతే ప్రస్తుతం అశోక్ బాబు విద్యార్హతలకు సంబంధించి ఫిర్యాదు చేసిన లోకాయుక్తకి ఫిర్యాదు చేయవచ్చు. 

అలా ఫిర్యాదు చేయడం మానేసి మా వాళ్ళు తప్పు చేశారు మీ మీద కూడా మసి పూస్తాం అన్నట్టు మాట్లాడటం హాస్యాస్పదంగా మారింది. ఎట్టకేలకు బెయిల్ దొరికిన తరువాత అశోక్ బాబు విడుదలయ్యారు విడుదలైన తర్వాత కూడా అశోక్ బాబు అదే రకమైన వ్యాఖ్యలు చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సీఐడీ పెట్టిన కేసులో నిజాయితీ లేదని బెయిల్ ద్వారా రుజువైందని పేర్కొన్నారు. కానీ అక్కడ బెయిల్ మాత్రమే వచ్చింది కేసు అలాగే ఉందనే విషయాన్ని మరిచిపోయారు. చిన్న పొరపాటుని పెద్ద నేరంలా చూపించారని అంటున్నారు. ప్రమోషన్ కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాన్ని మోసం చేయడం చిన్న పొరపాటు ఎలా అవుతుంది. అలా చేసిన వ్యక్తికి పదవులు కట్టబెట్టిన టీడీపీ అయినా చెప్పాలి కదా. వ్యవస్ధలో ఇంత చిన్న నేరాన్ని పెద్దగా చూపించారని అంటున్నారు. ఇది చిన్న నేరం ఎలా అవుతుందో? మరి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet