iDreamPost
android-app
ios-app

టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

కరోనా వైరస్‌ బారిన పడే వారి జాబితాలో టీడీపీ ఎమ్మెల్యే కూడా చేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు వైరస్‌ సోకింది. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో పయ్యావుల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని పయ్యావుల సూచించారు.

ఇప్పటి వరకూ ఏపీలో కరోనా వైరస్‌ బారిన పడిన ప్రజా ప్రతినిధులలో అత్యధిక శాతం వైసీపీ వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా స్పైడర్లు అంటూ విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కూడా వైరస్‌ బారినపడడంతో అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు తగ్గే అవకాశం ఉంది.

శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు అంచనా వేసినట్లుగానే ఏపీలో వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రోజుకు గరీష్టంగా పదివేల కేసులు నమోదయ్యే స్థితి నుంచి ప్రస్తుతం రోజుకు 2500 పాజిటివ్‌ కేసులు నమోదయ్యే స్థాయికి ఏపీలో వైరస్‌ వ్యాప్తి తగ్గింది. ఈ నెలాఖరు లోపు వైరస్‌ వ్యాప్తి మరింత తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet