iDreamPost
android-app
ios-app

TDP Complaint – వైసీపీని చూసి వాతలు పెట్టుకున్న టీడీపీ… బాబూ ఎందుకిలా?

TDP Complaint – వైసీపీని చూసి వాతలు పెట్టుకున్న టీడీపీ… బాబూ ఎందుకిలా?

సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం భేటీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటి అయిన టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప లు అధికార వైసీపీ మీద ఫిర్యాదు చేసినట్లు మీడియాకు టీడీపీ ప్రకటన వదిలింది. వైసిపి గుర్తింపు రద్దు చేయాలని కోరినట్లుగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థల పై అధికార వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేశారట. అయితే ఈ విషయంలో టీడీపీ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఆ పార్టీ నేతలు పట్టాభి, లోకేశ్ చేసిన దారుణ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు ఈసీ అధికారులకు వివరించగా వాళ్లు మాట్లాడిన మాటలు విని ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆశ్చర్యపోయారు అని తెలిసింది. సరిగ్గా వైసీపీ ఎంపీలు కలిసి ఫిర్యాదు చేసి వచ్చిన నాలుగు రోజులకు టీడీపీ బృందం వెళ్లి ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయడం చిన్నపిల్లల ఆట లాగే ఉందంటున్నారు విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్లో నిజంగా న్యాయ వ్యవస్థ సహా మిగతా అన్ని వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నట్లు వాళ్ళు నిజంగా భావిస్తే, భావించిన వెంటనే ఫిర్యాదు చేయాలి. అయితే అవన్నీ ఆరోపణలే కానీ నిజాలు ఏమీ లేవు కాబట్టి వారంతా సైలెంట్ గానే ఉన్నారు.

కానీ ముఖ్యమంత్రి మీద పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపడంతో వైసిపి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడంతో, ఎక్కడ నిజంగా గుర్తింపు రద్దు చేస్తారో అన్న భయంతో తాము ఆరోపిస్తున్న వాటిని సాకుగా చూపి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని వెళ్ళి ఫిర్యాదు చేశారు. అది ఎలాగో జరగని పనే కానీ ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేయడమే చర్చనీయాంశం అవుతోంది. నిజంగా సాలిడ్ రీజన్ ఉండి ఉంటే ఎప్పుడో ఫిర్యాదు చేయాల్సింది. కానీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఏదో చేసేసి ఇప్పుడు అభాసు పాలు అవ్వాల్సిన పరిస్థితి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని మాటకు ముందు మాట్లాడే చంద్రబాబు ఇలాంటి విషయాల్లో అంత ఈజీగా టార్గెట్ అవ్వడం టీడీపీ శ్రేణులకే మింగుడు పడటం లేదు.

Also Read : CM YS Jagan Simplicity – దటీజ్ జగన్.. అందుకేగా నిన్ను జనం గుండెల్లో పెట్టుకుంది