Idream media
Idream media
దేశంలోనే తాను సీనియర్ నాయకుడినని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటుంటారు. తాను గొప్ప అడ్మినిస్ట్రేటర్‌ని అని కూడా ఆయన భావన. టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ శ్రేణలు కూడా అదే భావనతో ఉంటూ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటాయి. అయితే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా అడ్మినిస్ట్రేషన్ లో బాబు మార్క్ ఒక్కటి కూడా కనిపించదు. ప్రజలకు మేలు చేశానని చెప్పుకునేందుకు ఒక్క పథకం ఉండదు. అయినా ఈ ప్రచారం జరుగుతూనే ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉంటుంది..? సరైన పాలన వల్ల ప్రజలకు ఎలాంటి ఫలాలు అందుతాయో వైసీపీ అధినేత, మొదటి సారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చూపిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేరవేశారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని మండల స్థాయికి తీసుకువస్తే.. జగన్ గ్రామ స్థాయికి తీసుకువచ్చారు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ తమ ఊర్లలోనే అందుతున్నాయి. విలువైన సమయం ఆదా అవుతోంది. తమకు వీలైన సమయంలో సచివాలయానికి వెళుతున్నారు. అదీ అవసరం లేకుండానే వలంటీర్ల ద్వారా రేషన్‌కార్డు, నూతన పింఛను, వివిధ ధృవీకరణ పత్రాలు.. ప్రజల ఇంటి వద్దనే అందుతున్నాయి.
Also Read : OTS నచ్చితేనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి… బాబుకు దొంగ ప్రేమెందుకో?
గ్రామ సచివాలయాల్లో 534 రకాల సేవలు అందుతున్నాయి. వీటికి అదనంగా.. వ్యవసాయం, పాడి రంగానికి అవసరమైన సేవలు అందించేందుకు వ్యవసాయ సహాయకులు, పశు వైద్యులను నియమించారు. ఆర్‌బీకే కేంద్రం ఏర్పాటు చేశారు. విత్తనం, ఎరువు, పురుగు మందులు, పంట బీమా, పంట అమ్మకం వరకూ అన్నీ ఆర్‌బీకేలలోనే జరుగుతున్నాయి. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్ కు సంబంధించిన సేవలను సచివాలయాల్లోనే అందిస్తున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లో ప్రారంభించేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా మొదట 51 గ్రామ సచివాలయాలను ఎంపిక చేసింది. సచివాలయ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చింది. సచివాలయ కార్యదర్శి రిజిస్ట్రార్‌గా వ్యవహరించేందుకు అవసరమైన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇలా విప్లవాత్మక సంస్కరణలతో దేశంలోనే ప్రభుత్వాన్ని, సేవలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గ్రామాలకు తెచ్చారు. దీన్ని బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే చంద్రబాబు సహించలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. వలంటీర్లపై తరచూ విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. తాజాగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం కేవలం రిజిస్ట్రార్లకు మాత్రమే ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. ‘‘ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు ఈ అధికారం’’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు సచివాలయ కార్యదర్శులు చేయడానికి వీలులేదని చెబుతూ.. రిజిస్ట్రార్లను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు చంద్రబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వారి గ్రామాలలోనే అందుతుంటే సహించలేకపోతున్న చంద్రబాబు.. రేపు రాబోయే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయాలను తీసేస్తాననే హామీ ఇస్తారా..?
Also Read : TDP, OTP Scheme, Chandrababu – ఓటీఎస్‌కు ఆటంకాలు రాబోతున్నాయా..? చంద్రబాబు వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?