iDreamPost
android-app
ios-app

గుంటూరులో టీడీపీ బరితెగింపు.. దొంగ ఓట్లు అడ్డుకోబోయిన మోదుగులపై దాడి

  • Published Mar 10, 2021 | 3:49 PM Updated Updated Mar 10, 2021 | 3:49 PM
  • Published Mar 10, 2021 | 3:49 PMUpdated Mar 10, 2021 | 3:49 PM
గుంటూరులో టీడీపీ బరితెగింపు.. దొంగ ఓట్లు అడ్డుకోబోయిన మోదుగులపై దాడి

మున్సిపల్‌ పోలింగ్‌ వేళ తనకు బలం ఉన్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బరితెగించింది. దొంగఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించింది. అడ్డుకోబోయిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని జేకేసీ కాలేజీలో దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారంతో మోదుగుల అక్కడికి వెళ్లారు.

ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాదులాట, తోపులాట జరిగింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు మోదుగుల కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మోదుగులకు స్వల్ప గాయాలవగా.. మోదుగులకు చెందిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ప్రతి దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ 42వ డివిజన్‌ అభ్యర్థికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Also Read : చెప్పకపోయినా ఓటేస్తారు.. కానీ ఓటేసేందుకు ఏం వెంటబెట్టుకెళ్లాలో చెప్పాలి కదా నిమ్మగడ్డ గారు..?

తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంపై మోదుగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేశారని, పోలీసులు సరైన సమయంలో స్పందించకపోతే తన ప్రాణాలే పోయేవని మోదుగుల ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులను కోరారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş