ఆఫీస్ లకి వస్తారా? రారా? ఆ సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్!

ప్రస్తుతం టెకీలందరిని ఆఫీసులకు రమ్మంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంకా కొంతమంది వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన వారందరిని కూడా ఆఫీసులకు రావాలంటూ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాయి కొన్ని సంస్థలు.

ప్రస్తుతం టెకీలందరిని ఆఫీసులకు రమ్మంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంకా కొంతమంది వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన వారందరిని కూడా ఆఫీసులకు రావాలంటూ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాయి కొన్ని సంస్థలు.

కరోనా సమయంలో అన్ని ఐటీ సంస్థలు వారి ఎంప్లాయిస్ కి వర్క్ ఫ్రొమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ తర్వాత గత సంవత్సరం నుండి .. అన్ని ఐటీ సంస్థలు ఎంప్లాయీస్ ను ఆఫీస్ లకు రమ్మని చెప్పాయి. అలా మొదట్లో హైబ్రిడ్ సిస్టం ని కొనసాగించిన సంస్థలు.. ఇప్పడు పూర్తిగా ఆఫీసుల నుంచే వర్క్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే, చాలా వరకు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి వర్క్ చేయడానికి అలవాటు పడి.. ఇప్పుడు ఆఫీస్ లకు రమ్మంటే ఎవరు కదలడం లేదు. దీనితో ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు కచ్చితంగా సంస్థ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే. మరి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి సంబంధించిన కొత్త ఆదేశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ .. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. గతంలోనే ఎన్నోసార్లు టెకీలను ఆఫీసులకు రమ్మని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇక ఇప్పుడు ఆఫీసులకు కచ్చితంగా తిరిగి వచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి చివరిలోపు ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ ఉద్యోగులకు సమాచారం అందించింది. అంతే కాకుండా ఇచ్చిన గడువు లోపు ఆఫీసులు రాని వారు .. దాని పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. TCS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యమ్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఈ విధంగా చెప్పుకొచ్చారు. “మేము సహనంతో ఉన్నాము. కానీ ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలనే కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ విషయంపై ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ పంపించాం. దీనిని అనుసరించని వారు దాని పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి పని చేయడం అనేది ఉద్యోగులతో పాటు యాజమాన్యానికి హాని కలిగిస్తుంది. ప్రస్తుతం సైబర్ దాడులు జరుగుతున్న క్రమంలో సంస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇంటి నుంచి భద్రత కల్పించలేం. అక్కడ బిజినెస్‌కు సెక్యూరిటీ రిస్క్‌లు ఉంటాయి.” అంటూ తెలియజేశారు.

అలాగే , గతంలో సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా వెల్లడించారు. కేవలం ఒక్క టాటా కంపెనీలో మాత్రమే కాకుండా.. మూడో అమెరికాలోని తమ యూనిట్లలోని ఒకదానిలో సైబర్ సెక్యూరిటీ సమస్య వచ్చినట్లు.. ఇన్ఫోసిస్ సంస్థ కూడా తెలిపింది. కాబట్టి ఈ క్రమంలో ఎటువంటి సైబర్ నేరాలకు లోనవకుండా ఉండేందుకు.. టీసీఎస్ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా కరోనా కు ముందు ఉన్న వారి ఒరిజినల్ కల్చర్ తిరిగి తీసుకొచ్చే విధంగా టీసీఎస్ ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమౌతుంది. మరి, టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments