iDreamPost
రేటు మాత్రం కాస్త ఎక్కువే. XZ+ వేరియంట్ ఐతే రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. అదే EV Max XZ+ Lux వేరియంట్ కొనాలంటే రూ. 19.24 లక్షలు పెట్టాల్సిందే.
రేటు మాత్రం కాస్త ఎక్కువే. XZ+ వేరియంట్ ఐతే రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. అదే EV Max XZ+ Lux వేరియంట్ కొనాలంటే రూ. 19.24 లక్షలు పెట్టాల్సిందే.
iDreamPost
కాస్త డిలే తర్వాత, టాటా మోటార్స్( Tata Motors) Nexon EV Max SUVని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. రేటు మాత్రం కాస్త ఎక్కువే. XZ+ వేరియంట్ ఐతే రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. అదే EV Max XZ+ Lux వేరియంట్ కొనాలంటే రూ. 19.24 లక్షలు పెట్టాల్సిందే.
బ్యాటరీ
40.5kWh బ్యాటరీని అమర్చారు. అందువల్ల ఒకసారి ఛార్జి చేస్తే, 437 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అదే Nexon EVలో ఒకసారి ఛార్జి చేస్తే 208 కిలోమీటర్లు మాత్రమే జర్నీ చేయొచ్చు. ఇప్పుడది 437 కిలోమీటర్లకు పెరిగింది. ఎలాంటి రోడ్లమీదైనా కనీసం 300 కిలోమీటర్లు గ్యారెంటీ. అంటే హైదరాబాద్ లో ఛార్జి చేసుకొంటే, ఎక్కడా ఆగకుండా విజయవాడకు హ్యాపీగా జర్నీచేయొచ్చు. ఈ కారులో రెండు ఛార్జింగ్ ఆప్షన్ ఉన్నాయి. 56 నిమషాల్లోనే 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. అందువల్ల టెన్షన్ ఫ్రీ
బ్యాటరీ సైజు పెరిగినా బూట్ సామర్ధ్యంలో ఎలాంటి మార్పూ లేదు. Nexon EV Maxలో 350లీటర్ల స్పేస్ ఉంది.రెగ్యులర్ Nexon EV కన్నా, Nexon EV Max మరో 70కిలోల బరువు పెరిగింది. కారణం పెద్ద బ్యాటరీ. దానికితోడు 30 కిలోల అదనపు ఎక్విప్ మెంట్.
స్పీడ్
9సెకండ్లలో 100 కిలోమీటర్లు. Nexon EV Max లో 143hp మోటార్ ఉంది. దీనివల్ల వందకిలోమీటర్ల స్పీడును 9 సెకండ్లలోనే చేరొచ్చు.
ఫీచర్లు
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫయిర్, కూల్డ్ సీట్స్, ESP, ఎత్తెన రోడ్లలో జర్నీకి ఉపయోగపడే hill-hold assist ఉన్నాయి. వీటిపాటు స్మార్ట్ వాచ్ తో స్క్రీన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీ కోసం cruise control ఉంది.
Nexon EV Max కొంటే బ్యాటరీకి, మోటార్ కి 8ఏళ్లు, లేదంటే 1,60,000కిలోమీటర్ల వారెంటీ ఉంది.