iDreamPost
android-app
ios-app

Serial Actress Mahalakshmi: కొత్త జంటపై బాడీ షేమింగ్, రవీందర్- మహాలక్ష్మీ స్ట్రాంగ్ కౌంట‌ర్, ఇది క‌దా ప్రేమంటే?

  • Published Sep 04, 2022 | 2:17 PM Updated Updated Sep 04, 2022 | 2:17 PM
  • Published Sep 04, 2022 | 2:17 PMUpdated Sep 04, 2022 | 2:17 PM
Serial Actress Mahalakshmi: కొత్త జంటపై బాడీ షేమింగ్, రవీందర్- మహాలక్ష్మీ స్ట్రాంగ్ కౌంట‌ర్, ఇది క‌దా ప్రేమంటే?

ఎలాంటి హ‌డావిడి, ముంద‌స్తు ముచ్చ‌ట్లు లేకుండా ఒకరినొకరు పెళ్లి చేసుకున్న‌ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్, వీడియో జాకీ కమ్ టెలివిజన్ నటి మహాలక్ష్మి తమ సోషల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో హెడ్ లైన్స్ లోకి వ‌చ్చారు. లేటెస్ట్ పోస్ట్‌లో, నిర్మాత , బిగ్ బాస్ విశ్లేషకుడు తన జీవితాన్ని అందంగా మార్చారని మహాలక్ష్మి పోస్ట్‌చేసింది. ఇంత‌లో రవీందర్ తన ఫేస్‌బుక్‌లో నటికి “ఐ లవ్ యు పొండాట్టి” అంటూ పోస్ట్‌తో రిప్ల‌య్ ఇచ్చాడు.

“మురుంగక్క చిప్స్”,Murungakka Chips”, “నట్పునా ఎన్నను తేరియుమా” “Natpunaa Ennanu Theriyumaa” వంటి సినిమాల‌కు నిర్మాత రవీందర్ చంద్రశేఖర్, సన్ మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొద‌లుపెట్టిన టీవీ స్టార్ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు.పెళ్లిలోని కొన్ని ఫోటోల‌ను అప్‌లోడ్ చేసిన ర‌వీందర్, తన యూట్యూబ్ ఛానెల్ “ఫ్యాట్ మ్యాన్ ఫ్యాక్ట్స్”లో త్వరలో ఒక వ్లాగ్‌ను ప్రసారం చేస్తానని ఫ్యాన్స్ కి చెప్పారు.

బిగ్ బాస్ షోపై త‌న రివ్యూల‌తో రవీందర్ తమిళ‌నాడులో బాగా తెలిసిన ఫేస్. “మన జీవితంలో మహాలక్ష్మి లాంటి అమ్మాయి వస్తే మన జీవితం బాగుంటుందని జ‌నం చెబుతారు, కానీ నాకు మహాలక్ష్మి వచ్చింది. త్వరలో లైవ్ ఇన్ ఫ్యాట్ మ్యాన్ ఫ్యాక్ట్స్ కుట్టి స్టోరీ విత్ మై పొండాటీఐఐ” అని తన పోస్ట్‌లో చెప్పారు.


ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకున్నారు. ఇద్ద‌రూ చాలా హ్యాపీ. కాని కొంద‌రికి మాత్రం ఈ జంట కాంబినేష‌న్ న‌చ్చ‌లేదు. బాగా లావుగా ఉన్న ర‌వీందర్, క్యూట్ గ‌ర్ల్ మ‌హాల‌క్ష్మిని పెళ్లిచేసుకోవ‌డంపై ట్రోలింగ్ చేస్తున్నారు.

‘అలాంటి వ్యక్తిని మహాలక్ష్మి ఎలా పెళ్లి చేసుకుంది.. ఇది నిజమా?’,‘డబ్బు కోసమే ఆయనను ఆమె క‌ట్టుకుంద‌ని ఎగ‌తాళిగా కామెంట్స్‌ చేస్తున్నారు. తమపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌పై ఈ జంట‌ స్పందించింది కూడా. ఆయన బరువు నాకు సమస్య కానేకాద‌దని చెప్పి ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు మ‌హాల‌క్ష్మి. ‘నాకు ఆయనంటే ఇష్టం. ఆయన ఎలా ఉన్నారో అలానే ఇష్టపడ్డాను. ఆయన బరువు తగ్గి వస్తా అన్నారు. అవసరం లేదు అని చెప్పానని మ‌హాల‌క్ష్మి తేల్చిచెప్పింది.


తమపై కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌ థంబ్‌ నేల్స్‌ చూసి ఇద్దరం నవ్వుకున్నామని చెప్పారు ఈ జంట‌. ఇక నిర్మాత రవిందర్ చాలా పాజిటీవ్. నెగిటివ్‌ కామెంట్స్‌ పెద్దగా పట్టించుకోమన్నారు. మా పెళ్లి ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. చాలా మంది మాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఎదుటివారి లైఫ్ మీద‌ అందరు సులువుగా మాటలు అనేస్తారు. వాటికి నేను పెద్దగా కుమిలిపోను అని ర‌వీందర్ చెబుతుంటే, మ‌హాల‌క్ష్మి ముసిముసి న‌వ్వులు రువ్వుతోంది. ఇది చాల‌దా ట్రోల‌ర్స్ కి స్ట్రాంగ్ కౌంట‌ర్?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet