iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?

  • Published Jan 30, 2023 | 3:40 PM Updated Updated Jan 30, 2023 | 3:40 PM
  • Published Jan 30, 2023 | 3:40 PMUpdated Jan 30, 2023 | 3:40 PM
రామ్ చరణ్ సూర్య కాంబోలో మల్టీస్టారర్ ?

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత మల్టీ స్టారర్ల ట్రెండ్ ఊపందుకుంది. దానికి వచ్చిన వరల్డ్ వైడ్ రెస్పాన్స్ చూసి సరైన కథ దర్శకుడు పడితే ఏ రేంజ్ లో సంచలనాలు చేయొచ్చో ఇండస్ట్రీ గమనిస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజల కాంబో ఎంత ప్లస్ అయ్యిందో చూస్తున్నాం. తాజాగా అలాంటి మరో కలయిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం. సీతారామంతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఇద్దరు హీరోలు ఉండే ఓ కథని సిద్ధం చేసుకుని సూర్యకు వినిపించాడట

మంచి డెప్త్ ఉన్న కంటెంట్ కావడంతో సూర్యకది నచ్చేసింది. అయితే దీనికి మరో స్టార్ కావాలి. లెన్త్ కాస్త ఎక్కువగా ఉండే క్యామియో కానీ స్పెషల్ రోల్ అది. స్టేచర్ ఉన్న నటుడైతేనే మార్కెట్ పరంగా హెల్ప్ అవుతుంది, సబ్జెక్టు పరంగా న్యాయం జరుగుతుంది. అందుకే ఒకసారి దీన్ని చరణ్ కు వినిపించమని హను రాఘవపూడికి సూర్య సలహా ఇచ్చినట్టు చెన్నై టాక్. అయితే ఇదంత సులభం కాదు. ఎందుకంటే చరణ్ ఇప్పటికే శంకర్ ప్యాన్ ఇండియా మూవీతో పాటు బుచ్చిబాబుకో ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. సుకుమార్ తోనూ ఒకటుంది.

అలాంటప్పుడు ఒకవేళ నిజంగా స్టోరీ నచ్చినా వెంటనే చేయలేని పరిస్థితి రావొచ్చు. హను ఒప్పిస్తాడా లేదా అనేది తేలాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది. పడి పడి లేచే మనసు లాంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కంబ్యాక్ కావటానికి హను రాఘవపూడికి చాలా టైం పట్టింది. దానికి తగ్గట్టే సీతారామం మంచి ఫలితం ఇవ్వడంతో ఈ సక్సెస్ ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో స్టార్లనే టార్గెట్ చేస్తున్నాడు. ఒకవేళ చరణ్ తో మిస్ అయినా సూర్య పక్కన ధీటుగా కనిపించే కో యాక్టర్ ని సెట్ చేసుకోవడం హనుకి పెద్ద సవాలే అవుతుంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom