iDreamPost
android-app
ios-app

Supritha: బీఆర్‌ఎస్‌ ఓటమి.. సుప్రీతపై నెటిజన్ల ట్రోలింగ్స్‌!

  • Published Dec 04, 2023 | 6:35 PM Updated Updated Dec 04, 2023 | 6:35 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు  బీఆర్ఎస్ క్యాంపైన్ వీడియోలు చేశారు. ఈ వీడియోలపై ట్రోలింగ్స్‌ మొదలయ్యాయి...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు  బీఆర్ఎస్ క్యాంపైన్ వీడియోలు చేశారు. ఈ వీడియోలపై ట్రోలింగ్స్‌ మొదలయ్యాయి...

  • Published Dec 04, 2023 | 6:35 PMUpdated Dec 04, 2023 | 6:35 PM
Supritha: బీఆర్‌ఎస్‌ ఓటమి.. సుప్రీతపై నెటిజన్ల ట్రోలింగ్స్‌!

టాలీవుడ్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుప్రీత..  తన గ్లామరెస్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ కు గురవుతూ ఉంది. ఆ ట్రోలింగ్స్‌ కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. తాజాగా సుప్రీయ వ్యవహరశైలిపై నెటిజన్లు ట్రోలింగ్స్‌ మొదలుపెట్టారు.

ఆ వివరాళ్లోకి వెళ్తే.. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రచారాల్లో సినీ తారలు సైతం తమకు నచ్చిన పార్టీకి మద్దతుగా ‍ప్రచారం చేశారు. నేరుగా ప్రచారంలో పాల్గొనో.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టో తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సుప్రీత కూడా అధికార బీఆర్ఎస్ కు మద్దతుగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అయితే, నిన్నటి ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవ్వటం.. కాంగ్రెస్‌ గెలవటం జరిగిపోయాయి.

దీంతో సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీపై నెటిజన్స్ స్పందించారు. విపరీతంగా ట్రోలింగ్స్‌ చేయటం మొదలుపెట్టారు.  ఈ క్రమంలోనే.. సుప్రీత వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. ఆ తరువాత.. తల్లి సురేఖతో కలిసి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను పోస్ట్‌ చేసింది. దీంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరీ ఇంత వేగంగా ఇలా మారిపోతారా? ఇంత త్వరగా షిఫ్ట్ అవుతారా? అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ ట్రోలింగ్‌ను ఆమె తట్టుకోలేకపోయింది. ట్రోలర్లను ఉద్దేశించి.. సుప్రిత తాజాగా తన ఇన్ స్టా వేదికపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “ఈ పొలిటికల్ సిట్యువేషన్ మీద నన్ను చాలా మంది ట్యాగ్ చేస్తూ వేధిస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. కొత్త సీఎం ను విష్ చేస్తూ పోస్ట్ వేశానంతే.. ఈ ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంతలా మీరు నన్ను ద్వేషించడానికి నేను మీకు అన్యాయం చేశాను. ఇది నన్ను మెంటల్‌గా ఎంత బాధ పెడుతుందో మీకు తెలుసా?”అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, సుప్రీతకు నెటిజన్లకు మధ్య నడుస్తున్న తాజా వివాదంపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetAnkara EscortGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom