iDreamPost
android-app
ios-app

ముంబై వరదల కారణంగా భారీగా నష్టపోయిన సన్నీ లియోన్‌!

  • Published Aug 10, 2023 | 2:39 PM Updated Updated Aug 10, 2023 | 2:39 PM
  • Published Aug 10, 2023 | 2:39 PMUpdated Aug 10, 2023 | 2:39 PM
ముంబై వరదల కారణంగా భారీగా నష్టపోయిన సన్నీ లియోన్‌!

సన్నీ లియోన్‌.. ఈ పేరుతో భారత సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పోర్న్‌స్టార్‌గా రికార్డులు సృష్టించిన ఆమె ఆ పరిశ్రమనుంచి మెల్లగా బయటకు వచ్చేశారు. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వరకు సినిమాలు చేస్తున్నారు. కరెంట్‌ తీగ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. కొద్దిరోజుల క్రితం ముంబై నగరాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా ముంబై వీధులు మొత్తం వరద నీటితో నిండిపోయాయి. అంతేకాదు.. రోడ్లపై ఉంచిన వాహనాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే సన్నీ లియోన్‌కు చెందిన రెండు ఖరీదైన కార్లు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో సన్నీ లియోన్‌ కన్నీటి పర్యంతం అయ్యారు. ఖరీదైన కార్లు అలా నీటిలో కొట్టుకుపోవటంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘ అది దారుణమైన అనుభవం. ఒకే రోజు నేను రెండు ఖరీదైన కార్లను పోగొట్టుకున్నాను. ఆ కార్లు ముంబై వరదల్లో కొట్టుకుపోయాయి. నేను బాగా ఏడ్చేశాను. ఎందుకంటే.. అవి ఇంపోర్టెడ్‌ కార్లు.. వాటికి పెద్ద మొత్తంలో టాక్స్‌ కట్టాను’ అని పేర్కొన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన వాటిలో ఓ మెర్సెడెస్‌ బెంజ్‌ కారు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం  ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సన్నీని ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు! కొంతమంది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయంటూ మండిపడుతున్నారు. మరి, సన్నీ లియోన్‌ ముంబై వరదల్లో రెండు ఖరీదైన కార్లు పోగొట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet