iDreamPost
android-app
ios-app

నా భార్యను కలిసేందుకు అనుమతివ్వండి : తీహార్ జైల్లో సుఖేశ్ నిరాహార దీక్ష

  • Published Jun 12, 2022 | 11:40 AM Updated Updated Jun 12, 2022 | 11:40 AM
నా భార్యను కలిసేందుకు అనుమతివ్వండి : తీహార్ జైల్లో సుఖేశ్ నిరాహార దీక్ష

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూలు చేసిన కేసులో గత నాలుగు నెలలుగా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి నిరాహార దీక్ష చేపట్టాడు. తనతోపాటు అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న తన భార్య లీనా మరియా పాల్ ను ప్రతివారం కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ.. మే 23 నుంచి నిరాహార దీక్ష చేపట్టాడు. దాంతో అధికారులు సుఖేష్ కు గ్లూకోజ్ లు ఎక్కిస్తున్నారు.

గతంలోనూ సుఖేశ్ తన భార్యను కలిసేందుకు నిరాహార దీక్ష చేయగా.. ప్రతి నెల మొదటి, మూడో శనివారం భార్య లీనాను కలిసేందుకు అనుమతిస్తున్నారు. కానీ వారాకోసారి కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరసనకు దిగాడు. మే 4 నుంచి 12 వరకూ దీక్ష చేశాడు. ఆ సమయంలో అతనికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్లను ఎక్కించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత 12 నుంచి 22 వరకూ లిక్విడ్ డైట్ తీసుకున్న సుఖేశ్.. 23 నుంచి మళ్లీ ఆహారం తీసుకోవడం మానేశాడని.. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలోనే గ్లూకోజ్ లు అందిస్తున్నామని తెలిపారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom