iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబోతో రాక్షసుడు 2

  • Published Aug 23, 2022 | 12:32 PM Updated Updated Aug 23, 2022 | 12:32 PM
  • Published Aug 23, 2022 | 12:32 PMUpdated Aug 23, 2022 | 12:32 PM
క్రేజీ కాంబోతో రాక్షసుడు 2

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కెరీర్ లో పెద్ద హిట్ ఏదైనా ఉందంటే అది రాక్షసుడు ఒకటే. తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ రీమేక్ గా రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ తెలుగులోనూ బాగా ఆడింది. దర్శకుడు రమేష్ వర్మ ఒరిజినల్ వెర్షన్ యధాతథంగా తీసినప్పటికీ టేకింగ్ పరంగా మంచి పేరే వచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపు రెడీ అవుతోంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ లో చేసినవాళ్లు ఇందులో ఉండట్లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోగా ఈగ విలన్ కిచ్చ సుదీప్ లాక్ అయినట్టు సమాచారం. స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధం కాగా క్యాస్టింగ్ కోసం జరిగిన అన్వేషణ ఆలస్యం కావడంతో షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. సో ఒక్కొక్కటిగా సెట్ అవుతున్నాయని తెలిసింది.

అయితే తమిళంలో ఇలాంటి సీక్వెల్ ఉండటం లేదు. వాళ్ళు వేరే ప్లానింగ్ లో ఉన్నారు. కేవలం టైటిల్ ని మాత్రమే వాడుకుని రమేష్ వర్మ పూర్తిగా కొత్త కథను ప్రెజెంట్ చేయబోతున్నారు. విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని అడిగినట్టు ఆయన సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరోయిన్ గా మాళవిక మోహనన్ ఎంపిక కూడా అయిపోయిందట. మొదటి భాగంలో అమ్మాయిల హత్యలను నేపథ్యంగా తీసుకున్నారు. ఈసారి ఎలాంటి బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తారో చూడాలి. అసలే ఈ మధ్య కాలంలో ఇలాంటి కథలు రొటీన్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉండటం అవసరం.

రమేష్ వర్మకు ఆ మధ్య రవితేజ ఖిలాడీ డిజాస్టర్ తీవ్ర నిరాశకరమైన ఫలితాన్ని అందించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా హీరోతోనే కౌంటర్లు వేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు తిరిగి అదే నిర్మాతకు రాక్షసుడు 2 చేయబోతున్న ఈయనకు ఇది పెద్ద హిట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా స్ట్రెయిట్ సబ్జెక్టుతో బ్లాక్ బస్టర్ లేని లోటు ఇదైనా తీరుస్తుందేమో చూడాలి. వంద కోట్ల బడ్జెట్ అని అప్పుడేదో వినిపించింది కానీ ఇలాంటి జానర్ అంత మొత్తం అంటే ఎక్కువే. కాకపోతే ఇప్పుడు క్యాస్టింగ్ పెద్దగా సెట్ అవుతోంది కాబట్టి సుదీప్ విజయ్ సేతుపతి మార్కెట్ పరంగా చూసుకుంటే వర్కౌట్ చేసుకునే ఛాన్స్ ఉంది మరి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet