iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ కు ముందు అనూహ్యంగా భారీ విజయం సాధించిన వకీల్ సాబ్ తర్వాత ఆ దర్శకుడు వేణు శ్రీరామ్ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. అల్లు అర్జున్ తో ఐకాన్ ఎప్పుడో ప్రకటించారు కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ యూనిట్ నుంచి రావడం లేదు. నిర్మాత దిల్ రాజు కూడా దాని ప్రస్తావన తేవడం లేదు. బన్నీ ఫోకస్ ఇప్పుడు పుష్ప 2 మీదే ఉంది. అన్నీ సవ్యంగా కుదిరి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే అక్టోబర్ లోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కరోనా లాంటి అడ్డంకులు ఏవీ లేకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ప్రమోషన్లు పూర్తయ్యాయి కాబట్టి సుకుమార్ ఈ పనిమీదే ఉన్నారు.
దీని తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ బోయపాటి శీను కాంబినేషన్ లో సినిమా దాదాపు ఖాయమేనని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ అదే నిజమైతే వేణు శ్రీరామ్ ఐకాన్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళలేదు. పైగా పుష్పతో నార్త్ లోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న బన్నీ ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరు. వకీల్ సాబ్ ఎంత బాగా డీల్ చేసినా దానికి వేణు శ్రీరామ్ కు దక్కిన క్రెడిట్ తక్కువే. రీమేక్ కావడంతో తన ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోవడానికి అవకాశం దక్కలేదు. కాకపొతే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మాస్ కి కనెక్ట్ అయ్యేలా చేసుకున్న మార్పులు కమర్షియల్ గా సేఫ్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. అంతే.
ఈ లెక్కన చూస్తే వేణు శ్రీరామ్ కొత్త ప్రాజెక్ట్ వేరే హీరోతో ఉండొచ్చు. అయితే ఎవరూ ఖాళీగా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. అందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. తనతో ఎంసిఎ చేసిన నాని కోసం ఓ కథను సిద్ధం చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో స్టార్ట్ అయితే కానీ చెప్పలేం. అయినా రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టాక కొత్త సినిమా రిలీజ్ కోసం సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కే మూడేళ్లు పట్టింది. అలాంటిది వేణు శ్రీరామ్ కు ఏడాది సమయం పెద్ద మ్యాటర్ కాదు. వకీల్ సాబ్ 2 ఉండొచ్చనే వార్తలు ఏవో వచ్చాయి కానీ పవన్ కమిట్ మెంట్స్ కోణంలో చూస్తే అది సాధ్యం కాకపోవచ్చు
Also Read : Unstoppable : బాలయ్య షో ప్రభావం గట్టిగానే ఉంది