iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో శివరాజ్ కుమార్ కి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

  • Published Nov 04, 2023 | 3:26 PM Updated Updated Nov 04, 2023 | 3:26 PM

తమ అభిమాన హీరోలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫ్యాన్స్ తట్టుకోలేరు.. షూటింగ్, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆందోళన చెందుతారు ఫ్యాన్స్. తమ హీరో క్షేమంగా రావాలని పూజలు చేస్తుంటారు.

తమ అభిమాన హీరోలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫ్యాన్స్ తట్టుకోలేరు.. షూటింగ్, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆందోళన చెందుతారు ఫ్యాన్స్. తమ హీరో క్షేమంగా రావాలని పూజలు చేస్తుంటారు.

  • Published Nov 04, 2023 | 3:26 PMUpdated Nov 04, 2023 | 3:26 PM
స్టార్ హీరో శివరాజ్ కుమార్ కి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కొంతమంది అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇలాంటి కేసులు భారీగా పెరిగిపోయాయి. తాము ఎంతగానో అభిమానించే హీరోలు ప్రమాదాలకు గురైనా, ఆస్పత్రిలో చేరినా అభిమానులు ఎంతగానో ఆందోళన చెందుతారు. తమ అభిమాన హీరోలు క్షేమంగా బయటకు రావాలని దేవుళ్లకు మొక్కుకుంటారు. ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హర్ట్ ఎటాక్ తో హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. కన్నడ నాట పవర్ స్టార్ పునీత్ రాజ్ సరిగ్గా రెండేళ్ల క్రితం 2021 లో అక్టోబర్ 30న వ్యాయాం చేస్తూ హఠాత్తుకు కుప్పకూలిపోయాడు.. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా స్టార్ హీరో తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..

కన్నడ స్టార్ హీరో శివ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయిన పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివ కుమార్. ఇటీవల తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా బిజీగా ఉంటున్నారు. 61 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలా కనిపించే హీరో శివరాజ్ కుమార్ చేతిలో ఇప్పుడు పదుల సంఖ్యల్లో సినిమాలు ఉన్నాయి. తాజాగా శివకుమార్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కారణంగా బెంగుళూరులోని వైదేహీ ఆస్పత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని కుటుంబ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలో చేరారు.. జనరల్ చెకప్ పూర్తయిన తర్వాత చికిత్స చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఒకప్పుడు కన్నడ చలన చిత్ర రంగాన్ని ఉర్రూతలూగించిన నటుడు, కన్నడ కంఠీవర రాజ్ కుమార్ తనయులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్ కుమార్. వీరిలో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ లు హీరోలుగా మంచి పేరు సంపాదించారు. 2021 లో పునీత్ రాజ్ కుమార్ హార్ట్ ఎటాక్ తో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శివరాజ్ కుమార్ కన్నీరుమున్నీరయ్యారు. మూవీస్ తో పాటు పలు టీవీ షోస్ లో ఆయన వ్యాఖ్యాతగా అలరించారు. కొన్నాళ్ల క్రితం ఆయన గుండెపోటు సమస్యతో బాధపడ్డారు. ఆ సందర్బంగా ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. బెంగుళూరులోని మాల్యా హాస్పిటల్ లో చికిత్స జరిగిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ మూవీలో ఇయన గెస్ట్ రోల్ లో నటించారు. ఇటీవల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఘోస్ట్’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక శివరాజ్ కుమార్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఫ్యాన్స్ ఆందోళన పడవొద్దని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş