iDreamPost
android-app
ios-app

youtuber Srikanth Reddy సారీ మేడమ్, కరాటే కల్యాణి తాటతీస్తా – శ్రీకాంత్ రెడ్డి

  • Published May 15, 2022 | 11:19 AM Updated Updated May 15, 2022 | 11:43 AM
  • Published May 15, 2022 | 11:19 AMUpdated May 15, 2022 | 11:43 AM
youtuber Srikanth Reddy సారీ మేడమ్, కరాటే కల్యాణి తాటతీస్తా – శ్రీకాంత్ రెడ్డి

రెండ్రోజుల క్రితం యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి – నటి కరాటే కల్యాణి లు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విషయం తెలిసిందే. యువతతో ఫ్రాంక్ వీడియోలు తీస్తూ, అమ్మాయిల్లో కామకోరికలు రేపుతూ వారిని వాడుకుంటున్నాడంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది. తాను చేసిందాంట్లో తప్పేముందంటూ శ్రీకాంత్ రెడ్డి కూడా ఆమెపై రివర్స్ ఎటాక్ చేశాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

తాజాగా.. శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఏం జరిగిందో I Dream News ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ‌ర్న‌లిస్ట్ స్ప‌ప్న‌కు వివరించాడు.

“మే 12, గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో భోజనం చేస్తుండగా కరాటే కల్యాణి మా ఇంటికొచ్చింది. రేయ్ శ్రీకాంత్ రెడ్డి బయటికి రారా అని అరిచింది. ఇంటిదగ్గర గొడవ వద్దని స్ట్రీట్ బయటకు వెళ్లి మాట్లాడదామని చెప్పాను. అలా బయటికి వెళ్లగానే కరాటే కల్యాణి, ఆమెతో వచ్చిన మనుషులు నాపై దాడి చేశారు. ఎందుకు కొడుతున్నారని అడిగి ప్రతిసారి నా చెంపపై కొట్టింది. నేను యూ ట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు తీయకూడదని చెప్పడానికి కరాటే కల్యాణి ఎవరు ? ఆమె ఎప్పుడూ బూతు కంటెంట్ ఉన్న సీన్లలో నటించలేదా ? నేను కేవలం ఫ్రాంక్ వీడియోలే తీశాను. కానీ.. ఆమె ఎక్స్ పోజ్ చేస్తూ నటించడం తప్పు కాదా ?

సినిమాల్లో ఏదైనా చేయొచ్చు గాని యూట్యూబ్ లో ఎందుకు చేయకూడదు? నాకు ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది. నేను కొనే ప్రతివస్తువుకీ టాక్స్ కడుతున్నాను. నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు తెలుసు. ఇలా ఫ్రాంక్ వీడియోలు తీస్తూ.. 5 లక్షల మంది SubScribers ను సంపాదించుకున్నాను. నా SubScribers కు లేని బాధ ఆమెకు ఎందుకు ? ఆమె బాధ నేను ఫ్రాంక్ వీడియోలు తీయడం కాదు. డబ్బు కావాలి. నేను వీడియోలు తీయాలంటే ఆమెకెందుకు డబ్బుకట్టాలి ? ఆమె పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి ? కరాటే కల్యాణి అక్రమంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడింది. బీజేపీలో సభ్యురాలిగా ఉన్నానని చెప్పుకుంటూ, ఒక ఓల్డేజ్ హోమ్ ద్వారా ఫండ్స్ రాబడుతూ.. ఆ డబ్బును దారి మళ్లిస్తోంది. రంగారెడ్డిలో స్థలాలను కబ్జా చేసింది. ఆమెపై 8 కేసులున్నాయి. అలాంటి ఆమె నాకు నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

నాపై దాడి చేసిన రోజు.. నీపై రేప్ కేసు పెడతానని కరాటే కల్యాణి నన్ను బెదిరించింది. నేను 1X అయితే.. కరాటే కల్యాణి 3X. నాపై దాడి అనంతరం ఆమె గురించి ఆరా తీస్తే.. చాలా విషయాలు తెలిశాయి. అయినా ఒక మహిళపై చేయిచేసుకోవడం నాదీ తప్పే. అందుకు ఆమెకు క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నాకు ఇంగిత జ్ఞానం, విచక్షణ ఉన్నాయి. ఆమెకు ఇవేవీ లేవు కాబట్టే దాడి చేసింది. నా జోలికి వచ్చినా, నా ఊసు తీసినా కరాటే కల్యాణిని వదిలేది లేదు. ఆమె తాట తీస్తా” అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş