Sri Sri: మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ మృతి

తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు రామోజీరావు మృతి చెందగా.. మరో ప్రముఖుడు సైతం కన్ను మూశారు. ఆ వివరాలు..

తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు రామోజీరావు మృతి చెందగా.. మరో ప్రముఖుడు సైతం కన్ను మూశారు. ఆ వివరాలు..

తెలుగు సాహిత్య లోకంలో శ్రీశీ అనే పేరు ఓ బ్రాండ్‌. 1940 దశకంలో శ్రీశీ పేరు చెబితే అప్పటి యువత ఊర్రూతలూగిపోయేవారు. తన కవిత్వంతో సమాజాన్ని మేల్కొలిపారు. మరీ ముఖ్యంగా ఆయన రచనల్లోని జగన్నాథుని రథ చక్రాలు, గర్జించు రష్యా వంటి కవితలు సమాజాన్ని ఓ ఊపు ఊపాయి. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చేసింది. శ్రీశీ తన వ్యాసాంగాన్ని కొనసాగిస్తూనే.. ఎన్నో సినిమాలకు మాటలు, పాటలు రాశారు. తెలుగు కవితా, సినీ ప్రపంచంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న శ్రీశ్రీ.. క్యాన్సర్‌ బారిన పడి 1983లో మరణించారు. ఈ క్రమంలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీశ్రీ కుమారుడు మృతి చెందారు. ఆ వివరాలు.

మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) మృతి చెందారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన గురువారం నాడు తుదిశ్వాస విడిచినట్లు.. గుంటూరులోని వారి కుటుంబ బంధువు డాక్టర్‌ రమణ యశస్వి ఒక ప్రకనటలో పేర్కొన్నారు. వెంకట రమణ మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు జరిపినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీశ్రీ రెండు వివాహాలు చేసుకున్నారు. రెండవ భార్య సరోజ ద్వారా శ్రీశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగారు. ప్రస్తుతం సరోజ వయసు 80 సంవత్సరాలు. ఈ వయసులో కుమారుడి మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీరంగం వెంకటరమణ అమెరికాలోని కనెక్టికల్‌ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. ఫైజర్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పాతికేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మాధవి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గణపవరం. వెంకట రమణ పిల్లలు శ్రీనివాసరావు, కవిత చదువుకుంటున్నారు.

శ్రీరంగం వెంకట రమణ మరణం పట్ల సాహితీ వేత్తలు, శ్రీశ్రీ అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచందర్ తమ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో  నేడు వరుస విషాదాలు చోటు చేసుకోవడం విచారకరంగా మారింది. రామోజీరావు మృతి చెందగా.. శ్రీశ్రీ కొడుకు కూడా కన్ను మూశారు. దీనిపై సాహిత్య ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments