iDreamPost
android-app
ios-app

Sravana Bhargavi : దుప్పటి కప్పుకొని కూర్చొన్నా, అశ్లీలంగానే కనిపిస్తాం.. పాట వివాదంపై స్పందించిన శ్రావణ భార్గవి

  • Published Jul 21, 2022 | 12:32 PM Updated Updated Jul 21, 2022 | 12:32 PM
  • Published Jul 21, 2022 | 12:32 PMUpdated Jul 21, 2022 | 12:32 PM
Sravana Bhargavi : దుప్పటి కప్పుకొని కూర్చొన్నా, అశ్లీలంగానే కనిపిస్తాం.. పాట వివాదంపై స్పందించిన శ్రావణ భార్గవి

Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్‌ సింగర్‌ శ్రావణ భార్గవి రిలీజ్‌ చేసిన ఓ పాట కొన్నిరోజులుగా వివాదమైంది. ప‌విత్ర‌మైన అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు భార్గ‌విపై మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం, కైంకర్యం చేస్తూ భక్తితో పాడాల్సిన‌ కీర్తనను, శ్రావణ భార్గవి స్నాక్స్ తింటూ, ర‌క‌ర‌కాల యాంగిల్స్ లో క‌నిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడంప‌ట్ల‌ చాలామందికి అభ్యంత‌ర‌ముంది.

సోష‌ల్ మీడియాపై ఒక విధంగా భార్గ‌విపై తీవ్ర‌మైన దాడి మొద‌లైంది. ఆమె పాట చిత్రీక‌ర‌ణ చాలామందికి న‌చ్చక‌పోవ‌చ్చు. కాని ట్రోల్ చేస్తున్న తీరు మాత్రం దారుణం. ఈ సోష‌ల్ మీడియా కామెంట్స్ పై సింగర్‌ శ్రావణ భార్గవి స్పందించింది. పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని బదులిచ్చింది. ‘ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం త‌ప్ప‌, ఇంకేదైనా కనిపిస్తే, అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు. మీరు చూసే చూపులో లోపం ఉంటే, దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది.

నేనేం లిరిక్స్‌ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే, దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ, అదే ఆడవాళ్లు రిలీజ్‌ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారుస అన్న‌ది శ్రావణ భార్గవి కౌంటర్‌.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş