iDreamPost
android-app
ios-app

Telangana KCR MLC -తెలంగాణ‌లో కొత్త ఎమ్మెల్సీలు వీరేనా?

Telangana KCR MLC -తెలంగాణ‌లో కొత్త ఎమ్మెల్సీలు వీరేనా?

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఆఫ‌ర్ కేసీఆర్ చాలా మందికే ఇచ్చారు. ప్ర‌తీ ఎన్నిక సంద‌ర్భంగానూ ప‌లువురికి హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఆ లిస్టు చాంతాడంత ఉంటుంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఇప్పుడు తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నిక జరిగిన తర్వాత స్థానిక సంస్థల ద్వారా మరో పన్నెండు మందిని ఎంపిక చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసే ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

రెండు దఫాలుగా జరిగే ఎన్నికల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటంతో పాటు.. మారిన రాజకీయానికి అనుగుణంగా.. సామాజిక సమీకరణాల్ని పక్కాగా పాటించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికయ్యే ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఒక్కో అభ్యర్థికి మద్దుతుగా పది మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాల మీద సంతకం చేయాల్సి ఉంది. మొత్తం ఆరు స్థానాలకు అరవై మంది ఎమ్మెల్యేల అవసరం ఉండటంతో.. వారందరికి ఇప్పటికే సమాచారం ఇవ్వటంతో పాటు.. హైదరాబాద్ కు వచ్చేయాలన్న సందేశాన్ని పంపినట్లుగా చెబుతున్నారు. దీంతో.. నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆదివారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు.

Also Read : Telangana Election Code -కోడ్ ముగిశాక వార్ పెర‌గ‌నుందా..?

అసెంబ్లీలో టీఆర్ఎస్ బలాన్ని చూస్తే.. మొత్తం 119 మంది సభ్యుల్లో 103 మంది గులాబీ ఎమ్మెల్యేలు ఉంటే.. ఏడుగురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ సొంత సీట్లతో పాటు మిత్రుడైన మజ్లిస్ కు కలుపుకొని మొత్తం 110 మంది ఎమ్మెల్యేల మద్దతు టీఆర్ఎస్ కు ఉంది. దీంతో.. తాజాగా జరుగుతున్న ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలతోపాటు.. స్థానిక సంస్థలకు జరిగే 12 స్థానాల్ని సైతం తన ఖాతాలో వేసుకునే అవకాశం టీఆర్ఎస్ కు ఉంది. ఇప్ప‌టికే ఓ లిస్టు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించిన కేసీఆర్ డిసైడ్ చేసిన అభ్యర్థుల్లో.. ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ సీతారాం నాయక్.. మాజీ ఛైర్మన్ ధరావత్ గాంధీ నాయక్ లో ఒకరికి, ఎల్ రమణ, మధుసూదనాచారి, ఆకుల లలిత.. పీఎల్ శ్రీనివాస్ లో ఒకరికి, ఎంసీ కోటిరెడ్డి.. అల్లీపురం వెంకటేశ్వరెడ్డిలో ఒకరికి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే స్థానిక సంస్థల కోటాలో జూపల్లి క్రిష్ణారావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, కల్వకుంట్ల కవిత, కసిరెడ్డినారాయణరెడ్డి, శంభీపూర్ రాజు, వి.భూపాల్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఎప్పుడో నిర్ణ‌యించారు. కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతుండ‌డంతో గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటా ద్వారా ఎంపిక చేసి, కౌశిక్ రెడ్డిని స్థానిక సంస్థల ద్వారా ఎన్నికయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : MLC Elections, Sajjala, YCP Candidates – స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు… 11 మంది వైసీపీ అభ్యర్థులు వీరే..

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetraBetrakatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş