iDreamPost
android-app
ios-app

ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయిన స్టార్‌ హీరో భార్య!

  • Published Aug 16, 2023 | 8:31 AM Updated Updated Aug 16, 2023 | 8:31 AM
  • Published Aug 16, 2023 | 8:31 AMUpdated Aug 16, 2023 | 8:31 AM
ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయిన స్టార్‌ హీరో భార్య!

కన్నడ స్టార్‌ హీరో విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ టూరులో ఉన్న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. కుటుంసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ స్పందన తుది శ్వాస విడిచారు. తాజాగా, ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్పందన అస్తికలను కుటుంబసభ్యులు శ్రీరంగ పట్టణంలోని కావేరీ నదిలో కలిపారు. ఆమె చనిపోయి దాదాపు రెండు వారాలు గడుస్తున్నా కుటుంబసభ్యులు ఆ బాధలోంచి కొంచెం కూడా బయటపడలేకుండా ఉన్నారు.

కేవలం కుటుంబసభ్యులే కాదు.. బంధువులు కూడా ఆమె గురించి తలుచుకుని బాధపడుతున్నారు. తాజాగా, స్పందన ఆఖరి కోరికకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆఖరి కోరిక తీరకుండానే ఆమె చనిపోయారట. ఇంతకీ స్పందన ఆఖరి కోరిక ఏంటంటే.. ఆమె శాండల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్‌ కావాలని అనుకున్నారట. సినిమా ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావించారట. ఎంతో మందికి సినిమా అవకాశాలు ఇవ్వాలని అనుకున్నారట.

దివంగత స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ తల్లి పార్వతమ్మ లాగా తాను కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నారట. ఈ విషయాలను ఆమె తన డైరీలో రాసుకున్నారట. ఇందుకు సంబంధించిన వివరాలను స్పందన మామ పితాంబర హేరాజ్‌ మీడియాకు వెల్లడించారు. కాగా, నిన్న ఆగస్టు 16న స్పందన ఉత్తర క్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మీడియా మిత్రులు కొందరు ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి, ఆఖరి కోరిక తీరకుండానే స్పందన చనిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom