Vande Bharat: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సికింద్రబాద్‌ నుంచి ఫస్ట్‌ వందేభారత్‌ స్లీపర్‌..

Vande Bharat Sleeper Train-Secunderabad: తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Vande Bharat Sleeper Train-Secunderabad: తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఇండియన్‌ రైల్వేలో అనేక సంస్కరణలతో పాటు నూతన ఆవిష్కరణలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇక ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం.. సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం భారతీయ రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. వాటితో పాటుగా టికెట్‌ బుకింగ్‌ మొదలు ప్రమాదాల కట్టడి కోసం సరికొత్త సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. త్వరలోనే మన దేశంలో బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం అయితే సెమీ హై స్పీడ్‌ వందే భారత్‌ రైళ్లు దేశమంతా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటి వరకు వీటిలో కేవలం కూర్చుని ప్రయాణించేందుకు మాత్రమే సౌకర్యం ఉండేది. ఇక త్వరలోనే వీటిల్లో స్లీపర్‌ రైళ్లు పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రబాద్‌ నుంచి తొలి వందే భారత్‌ స్లీపర్‌ పరుగులు పెట్టనుంది. ఆ వివరాలు..

త్వరలోనే దేశవ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే నెల అనగా ఆగస్టు నుంచి ఈ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రధాన నగరాల మధ్య విడతల వారీగా వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను పట్టాలెక్కించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికంద్రాబాద్ నుంచి పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి వందేభారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబై వరకు నడిపే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికైతే.. సికింద్రాబాద్ నుంచి ముంబైకు వందేభారత్ రైలు సర్వీస్ లేదు.. అందుకే ఈ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుంచి ముంబైకు నడిపే ఆలోచనలో ఉన్నారట రైల్వే శాఖ అధికారులు.

సికింద్రాబాద్ నుంచి ముంబై మధ్య వందేభారత్ రైలు లేకపోవడంతో.. ఈ మార్గంలో స్లీపర్‌ రైలును నడపాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. దక్షిణ మధ్య రైల్వే జీఎం‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు, రైల్వే బోర్డుకు ఆదేశాలు జారీ చేసే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. స్లీపర్‌ రైలు మాత్రమే కాక.. సికింద్రాబాద్‌-పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో కూడా వందేభారత్‌ రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ స్లీపర్ రైలు ఏ మార్గంలో నడపాలనే అంశంపై రైల్వేశాఖ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ వందే భారత్‌ స్లీపర్‌ రైలు వస్తే.. ఈమార్గంలో ప్రయాణించే వారికి ఎంతో లబ్ధి కలగనుంది అని చెప్పవచ్చు.

Show comments