iDreamPost
android-app
ios-app

సౌత్, నార్త్ కాదు.. మనమంతా ఇండియన్స్.. ఇవన్నీ ఇండియన్ సినిమాలు..

  • Published Jun 09, 2022 | 7:00 PM Updated Updated Apr 25, 2024 | 9:03 PM

తెలుగులో ఇంద్ర, ఖడ్గం, మురారి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మెప్పించిన సోనాలి బింద్రే ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. మధ్యలో క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమై క్యాన్సర్ తో పోరాడి మళ్ళీ అంతే జోష్ తో తిరిగొచ్చింది.

తెలుగులో ఇంద్ర, ఖడ్గం, మురారి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మెప్పించిన సోనాలి బింద్రే ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. మధ్యలో క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమై క్యాన్సర్ తో పోరాడి మళ్ళీ అంతే జోష్ తో తిరిగొచ్చింది.

  • Published Jun 09, 2022 | 7:00 PMUpdated Apr 25, 2024 | 9:03 PM
సౌత్, నార్త్ కాదు.. మనమంతా ఇండియన్స్.. ఇవన్నీ ఇండియన్ సినిమాలు..

తెలుగులో ఇంద్ర, ఖడ్గం, మురారి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మెప్పించిన సోనాలి బింద్రే ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. మధ్యలో క్యాన్సర్ రావడంతో సినిమాలకి దూరమై క్యాన్సర్ తో పోరాడి మళ్ళీ అంతే జోష్ తో తిరిగొచ్చింది. ఇటీవలే మెల్లి మెల్లిగా కెమెరాల ముందుకు వస్తుంది సోనాలి. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ షోతో బాలీవుడ్ లో పలకరించింది. తాజాగా ది బ్రోకన్‌ న్యూస్‌ అనే సిరీస్ లో నటించింది.

ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల బాలీవుడ్ మీడియాకి పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు సోనాలి బింద్రే. కొన్ని రోజుల నుంచి ఏ సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇచ్చిన సౌత్, నార్త్ సినిమాల టాపిక్ కచ్చితంగా ఎదురవుతుంది. సొనాలికి కూడా ఈ టాపిక్ ఎదురవడంతో ఇలా సౌత్, నార్త్ అని మాట్లాడే విషయంపై తన అభిప్రాయం తెలిపింది.

సోనాలి బింద్రే మాట్లాడుతూ.. ఇప్పుడు వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. కథలు బాగుండబట్టే సినిమాలు అంతగా ఆడుతున్నాయి. కథతో పాటు, చిత్రబృందం, నటీనటులు అందరూ కష్టపడినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకి RRR సినిమానే తీసుకుంటే సినిమా కోసం నటులుగా తారక్‌, రామ్‌చరణ్‌, దర్శకత్వంలో రాజమౌళి.. ఇలా అన్ని భాగాల్లో అందరూ కష్టపడ్డారు కాబట్టే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది. ఈ సౌత్, నార్త్ పక్కన పెడితే ముందు మనమంతా భారతీయులం. ఏదైనా కొత్త సినిమా విజయం సాధిస్తే దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ ఇండియన్ సినిమాలే. సినిమాలు ఇలా థియేటర్లలో మళ్ళీ విజయాలు సాధిస్తున్నందుకు అంతా సెలబ్రేట్ చేసుకోవాలి అని తెలిపింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş