iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: గుండెపోటుతో మృతి చెందిన ఎమ్మెల్యే

  • Published Jul 19, 2023 | 8:02 PM Updated Updated Jul 19, 2023 | 8:03 PM
  • Published Jul 19, 2023 | 8:02 PMUpdated Jul 19, 2023 | 8:03 PM
బ్రేకింగ్: గుండెపోటుతో మృతి చెందిన ఎమ్మెల్యే

వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఇటు సినీ ప్రముఖుల నుంచి అటు రాజకీయ నాయకుల వరకు చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇక వయసుతో సంబధం లేకుండా అందరూ హార్ట్ ఎటాక్ గురై మరణిస్తున్నారు. ఈ వరుస గుండెపోటు మరణాలు వరువక ముందే తాజాగా ఓ ఎమ్మెల్యే హార్ట్ ఎటాక్ తో మరణించారు. ఇతని మృతితో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, రాజకీయ నాయకులు షాక్ గురవుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం సైతం స్పందించి సంతాపం తెలిపారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరంటే?

త్రిపుర సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సంసుల్ హక్ (67) తాజాగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్దారించారు. సంసుల్ హక్ మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే మరణవార్త తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహ దిగ్భ్రాంతికి లోనై సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే సంసుల్ హక్ చనిపోయారని తెలుసుకున్న పార్టీ నేతలు, రాజకీయ నాయకులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అంటూ చెబుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom