iDreamPost
android-app
ios-app

వీడియో: షారుక్ కుమార్తె గొప్ప మనసు.. నెట్టింట ప్రశంసల వెల్లువ!

  • Published Aug 12, 2023 | 8:09 PM Updated Updated Aug 12, 2023 | 8:09 PM
  • Published Aug 12, 2023 | 8:09 PMUpdated Aug 12, 2023 | 8:09 PM
వీడియో: షారుక్ కుమార్తె గొప్ప మనసు.. నెట్టింట ప్రశంసల వెల్లువ!

బాలీవుడ్ బాద్ షా కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా షారుక్ ఖాన్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంక ఆయనకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ మొత్తానికి బాలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు క్లిక్ మనిపిస్తూనే ఉంటాయి. పార్క్, జిమ్, సినిమా, రెస్టారెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టరు. తాజాగా ఓ రెస్టారెంట్ కి వచ్చిన షారుక్ ఫ్యామిలీని కెమెరాలు వెంబడించగా.. ఒక ఆసక్తికర సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా సుహానా ఖాన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

సాధారణంగానే సెలబ్రిటీ పిల్లలకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే సుహానా ఖాన్ కు కూడా ఉంది. తాజాగా తల్లి గౌరీ ఖాన్ తో కలిసి ఓ బుక్ లాంఛ్ ఈవెంట్ నుంచి వస్తుండగా సుహానా ఖాన్ కెమెరా కంటికి చిక్కింది. ఈవెంట్ నుంచి బయటకు రాగానే హోటల్ బయట ఒక మహిళ సుహానా ఖాన్ ను సహాయం కోరింది. తనకు ఏదైనా ఇవ్వని అడిగింది. ఆకలితో ఉన్న పిల్లలు ఉన్నారు ఏదైనా సహాయం చేయండి అంటూ కేకలు పెట్టింది. సుహానా ఖాన్ వెంటనే తన పర్స్ నుంచి డబ్బు తీసి ఇచ్చింది. మొదట ఒక 500 నోటు ఇవ్వగా.. వెంటనే మరో 500 నోటు తీసి ఇచ్చింది. రెండో నోటు ఇవ్వగానే ఆ మహిళ సంతోషంతో గంతులు వేసింది. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

నెటిజన్స్ అంతా ఈ వీడియోపై స్పందించడం ప్రారంభించారు. షారుక్ ఖాన్ కుమార్తెది ఎంతో గొప్ప మనసు అంటూ చెప్పుకొచ్చారు. చాలా మంది సెలబ్రిటీలను వాళ్లు అడిగి ఉంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే వారికి సహాయం చేస్తారు. సుహానా ఖాన్ ఇచ్చింది వెయ్యి రూపాయలే అయినా కూడా.. తీసుకున్న మహిళకు మాత్రం అవి ఎంతో విలువైనవి అంటూ కామెంట్ చేస్తున్నారు. తండ్రికి తగ్గట్లే ఎంతో గొప్ప మనసు కలిగిన వ్యక్తి సుహానా ఖాన్ అంటూ పొగిడేస్తున్నారు. సన్నివేశం కనపడింది. షారుక్ ఖాన్ కుమార్తె సుహాన ఖాన్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంక సుహానా ఖాన్ తన యాక్టిగ్ కెరీర్ మొదలు పెట్టబోతోందని చెబుతున్నారు. జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ లో సుహానా ఖాన్ ఎంట్రీ ఇస్తోంది. దీనిని డైరెక్ట్ ఓటీటీగా తీసుకొస్తున్నారు. ఇందులో ఖుషీ కపూర్, అమితాబ్ మనవడు అగస్త్య నందా కూడా నటించారు. ది ఆర్చీస్ ఈ ఏడాది చివర్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş