iDreamPost
android-app
ios-app

సమంతా వచ్చేసింది – ఇక పరుగులే

  • Published Jan 07, 2023 | 8:20 PM Updated Updated Dec 19, 2023 | 3:10 PM

నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు వచ్చిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే తన పరిస్థితి మరింత తీవ్రమైందని పుకార్లు వచ్చిందనే నేపథ్యంలో వాటికి పూర్తిగా చెక్ పెడుతూ సామ్ ఆరోగ్యంగా కనిపించింది.

నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు వచ్చిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే తన పరిస్థితి మరింత తీవ్రమైందని పుకార్లు వచ్చిందనే నేపథ్యంలో వాటికి పూర్తిగా చెక్ పెడుతూ సామ్ ఆరోగ్యంగా కనిపించింది.

  • Published Jan 07, 2023 | 8:20 PMUpdated Dec 19, 2023 | 3:10 PM
సమంతా వచ్చేసింది – ఇక పరుగులే

ఆ మధ్య అరుదైన వ్యాధితో బాధపడుతూ యశోద ప్రమోషన్లకు రాలేక ఆసుపత్రికే పరిమితమై అక్కడే ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన దుస్థితిని ఎదురుకున్న సమంతా ఎట్టకేలకు బయటికి వచ్చేసింది. నిన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగినప్పుడు వచ్చిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే తన పరిస్థితి మరింత తీవ్రమైందని పుకార్లు వచ్చిందనే నేపథ్యంలో వాటికి పూర్తిగా చెక్ పెడుతూ సామ్ ఆరోగ్యంగా కనిపించింది. అయితే విపరీతమైన విశ్రాంతి మందుల వల్ల బాగా చిక్కినట్టు అనిపించినా త్వరలోనే పూర్తిగా కోలుకోవడం ఖాయమే. తను తిరిగి వచ్చేయడంతో కోట్లాది రూపాయలు ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు రెక్కలు వస్తున్నాయి

వాటిలో మొట్టమొదటిది విజయ్ దేవరకొండ ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ లవ్ కం ఎమోషనల్ జర్నీలో ఇంకొంత భాగం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. మార్చిలోగా పూర్తి చేసి వేసవి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే అంతకు ముందు చిత్రీకరించిన భాగానికి ఇప్పటికి సామ్ మొహంలో శరీరంలో మరీ తీవ్రమైన మార్పులు కనిపించకుండా మొత్తం సెట్ అయ్యాకే రీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికెలు నిర్మిస్తున్న సిటాడెల్ లోనూ తనదే ప్రధాన పాత్ర. దాని తాలూకు స్క్రిప్ట్ డిస్కషన్ కోసమే తాజాగా ముంబై వచ్చినట్టు తెలిసింది. ఈ షూట్ కూడా అతి త్వరలో పాల్గొనబోతోంది

వచ్చే నెల 17న విడుదల కాబోతున్న శాకుంతలం ప్రమోషన్ల కోసం సమంతా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనుంది. దిల్ రాజు గుణశేఖర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ పౌరాణిక గాధని త్రీడిలో తెరకెక్కించారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ తనకు జోడిగా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. సో రాబోయే నెలల్లో సమంతా పూర్తిగా బిజీ కానుంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయి. ఇకపై వరసగా చేస్తుందా లేక బాలన్స్ ఉన్న కమిట్ మెంట్స్ ని పూర్తి చేసి ఇంకొంత కాలం విశ్రాంతి తీసుకుంటుందా అనేది శాకుంతలం ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş