మంకీపాక్స్ వ్యాప్తికి అసలు కారణం ఇదే : WHO

కరోనా తర్వాత.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో వైరస్ మంకీపాక్స్ (Monkeypox). ఇది ఎలా వస్తుంది ? ఎందుకొస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే 29 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. భారత్ లోనూ ఒకట్రెండు ప్రాంతాల్లో చిన్నారులకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. తాజాగా.. మంకీపాక్స్ వ్యాప్తికి గల ప్రధాన కారణం ఏంటో వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation). శృంగారం (Sex) కారణంగా మంకీపాక్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లుగా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.

కరోనా మాదిరిగా మంకీపాక్స్ కూడా.. మాట్లాడేటప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందనేందుకు తమ వద్ద ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. కానీ.. మంకీపాక్స్ (Monkeypox) సోకినవారు హోం ఐసోలేషన్లో ఉండి, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలని సూచించారు. మంకీపాక్స్ చికిత్స (Monkeypox Treatment)కు యాంటీవైరల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఈ వ్యాక్సిన్లు మంకీపాక్స్ కు వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ 29 దేశాల్లో 1000కిపైగా మంకీపాక్స్ కేసులను గుర్తించినట్లు టెడ్రోస్ పేర్కొన్నారు.

Show comments