iDreamPost
android-app
ios-app

భువనేశ్వరి కోరిక నెరవరితే.. పాపం బాబు భవిష్యత్‌ ఏంటి?

  • Published Oct 19, 2023 | 11:26 AM Updated Updated Oct 19, 2023 | 11:26 AM
  • Published Oct 19, 2023 | 11:26 AMUpdated Oct 19, 2023 | 11:26 AM
భువనేశ్వరి కోరిక నెరవరితే.. పాపం బాబు భవిష్యత్‌ ఏంటి?

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటన్న సంగతి తెలిసిందే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని.. స్కిల్‌ స్కామ్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ చేయడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో ఆయనకు ఇంతవరకు బెయిల్‌ లభించలేదు. ఇదే కాక అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా ఆయన ఏ1గా ఉన్నారు. ఇక ఇదే కేసులో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ కూడా ఏ14గా ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే వారు ఎవరూ లేరు. ఇక బాబు అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి లోకేష్‌ ఢిల్లీకే పరిమితం కాగా.. బాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తెర మీదకు వచ్చారు.

ఈ క్రమంలో బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పలు కార్యక్రమాలకు పిలుపునిస్తుండగా.. జనాలు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తాజాగా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వచ్చింది. ఇది చూసిన జనాలు.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది అదే కదా.. నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టే బాబు అవినీతి వెలుగులోకి వచ్చింది.. అరెస్ట్‌ అయ్యాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పైగా బాబు సతీమణి భువనేశ్వరే నిజం గెలవాలి అనే నినాదం ఇవ్వడంతో.. అంటే ఇంతకాలం అబద్ధం గెలిచింది.. కాబట్టే బాబు కేసుల నుంచి తప్పించుకోగలిగాడు. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అందుకే బాబు అరెస్ట్‌ అయ్యాడంటున్నారు జనాలు.

వ్యవస్థల మీద ఎంతో బలమున్న చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైలుకి వెళ్తానని కనీసం కలలో కూడా ఊహించి ఉండడు. కానీ కాలమెప్పుడు మనకే అనుకూలంగా ఉండదు కదా. ప్రస్తుతం బాబు విషయంలో కూడా ఇదే జరిగింది అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.. అందుకే బాబు జైల్లో ఉన్నాడు అంటున్నారు జనాలు. పిల్లనిచ్చిన మామను మోసం చేసి.. వెన్నుపోటి పొడిచి.. కనీసం ఆయన వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా చెప్పలేయించి పాపం మూటగట్టున్నాడు.. ఇప్పుడది పండి.. తనకే తగిలింది అని వైసీపీ శ్రేణులు విమర్శలు కురిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తన అనుకూల మీడియాతో.. ఏం జరిగినా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ.. మచ్చలేని చంద్రుడిగా కవరింగ్‌ ఇస్తూ వచ్చాడు. అయితే కాలం ఎప్పుడూ మనకే అనుకూలంగా ఉంటుంది అనుకుంటూ పొరపాటే.. సమయం వచ్చినప్పుడు నిజాలన్ని బయటకు వస్తాయి.. ప్రస్తుతం బాబు విషయంలో కూడా అలానే జరిగింది అంటున్నారు జనాలు.

ఇక జనాల ఆలోచనలకు దగ్గట్టుగానే ప్రస్తుతం భువనేశ్వరి సైతం.. చంద్ర‌బాబు గెల‌వాలి అనే నినాదానికి బ‌దులు ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధపడటం గమనార్హం. ఈ క్రమంలోనే నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరి కోరికే నిజమైతే.. బాబు చేసిన అక్రమాలు అన్ని బయటకు వస్తే.. ఇక ఆయన శాశ్వతంగా జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది అంటున్నారు జనాలు. అంతేకాక భువ‌నేశ్వ‌రి కోరిక నెర‌వేరితో బాబు భ‌విష్య‌త్ ఇక అంతే.. ఆయన చాప్టర్‌ క్లోజ్‌ అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobet