iDreamPost
android-app
ios-app

మందు తాగేవాడు మ‌హ‌నీయుడు

మందు తాగేవాడు మ‌హ‌నీయుడు

ఒక తాగుబోతుకి మందు దొర‌క‌క మైండ్ దొబ్బింది. డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లాడు.
“మందు లేక‌, ఎవ‌రో నా చెవిలో మాట్లాడుతున్న‌ట్టు , వినిపిస్తోంది డాక్ట‌ర్” అన్నాడు.
“ఏం వినిపిస్తోంది చెప్పు” అడిగాడు డాక్ట‌ర్‌.
“చీర్స్‌, ఇంకో పెగ్గు మామ‌, ఇదే లాస్ట్ పెగ్‌రా, సోడా పొయ్యి బే..ఐస్ క్యూబ్స్ ఎక్క‌డ్రా…” చెప్పాడు మందు బాబు.
“నో ప్రాబ్ల‌మ్‌, స‌డెన్‌గా మందు మానేస్తే ఇలాగే ఉంటుంది. మందు మీద నుంచి నీ ఆలోచ‌న‌ల్ని డైవ‌ర్ట్‌ చేయాలి.

నీకిష్ట‌మైన ఒక బొమ్మ వేయ్” అని డాక్ట‌ర్ పేప‌ర్ పెన్ను ఇచ్చాడు.
మందుబాబు బాటిల్‌, గ్లాస్ బొమ్మ వేశాడు.

డాక్ట‌ర్ కంగారుప‌డి “ఒక పాట పాడు” అన్నాడు.
“తాగుతా నీయ‌వ్వ తాగుతా” అని ఎత్తుకున్నాడు మందుబాబు.

“ఇష్ట‌మైన ర‌చ‌యిత” ప్ర‌శ్న‌లు స్టార్ట్ చేశాడు డాక్ట‌ర్‌.
“డాస్టోవిస్కీ”

“ఇష్ట‌మైన ప‌క్షి”
“కింగ్‌ఫిష‌ర్‌”

“జంతువు”
“బ్లాక్‌డాగ్‌”

“మీ అబ్బాయి పేరు”
“దేవ‌దాసు”

“నీ పెళ్లాం పేరు”
“నిషాదేవి”

“నీ పేరు”
“సురపాని”

“ఒక క‌వి పేరు చెప్పు”
“క‌బీరు”

“ప‌ని చేస్తున్న కంపెనీ”
“పెగ్ (Peg- పీట‌ర్ ఇంగ్లండ్ గ్రూప్‌)”

“నీకు లెక్క‌లొస్తాయా? 90 + 45 ఎంత‌?”
“One And Half Quarter”

“ఇష్ట‌మైన బుక్‌”
డి”వైన్‌” కామెడీ

“నీ ఫ్రెండ్ పేరు”
“జాక్ డేనియ‌ల్‌”

“ఒక సామెత చెప్పు “
“ప‌రిగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్ల‌లోకి బ్రాంది క‌లుపుకుని తాగ‌డం మేలు”

“హీరోయిన్‌”
“క‌త్రినా కైపు”

“న‌టుడు”
“జానివాక‌ర్‌”

“సినిమా”
“మ‌ధుమ‌తి”

“ఫుడ్‌”
కా”రం” దోశ

“గాయ‌కుడు”
“సారంగ‌పాణి”

డాక్ట‌ర్ జుత్తు పీక్కుని “అస‌లు హైద‌రాబాద్‌లో ఎక్క‌డుంటావు రా నువ్వు” అని అడిగాడు.
“తానిషా న‌గ‌ర్‌”

“నిన్ను ఆ దేవుడే బాగు చేయాలి”
“గుళ్లు మూసేశార్ సార్‌”

“గూగుల్‌లో మోడీ ఫొటో ఓపెన్ చేసి తొంద‌ర‌గా లాక్‌డౌన్ ఎత్తివేయ‌మ‌ని వేడుకో. ఆయ‌న త‌ప్ప నిన్ను ఎవ‌రూ కాపాడ‌లేరు” అని డాక్ట‌ర్ ష‌ట్ట‌ర్ దించి ఆస్ప‌త్రి మూసేశాడు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis