iDreamPost
android-app
ios-app

సామ్ యశోదలో అసలు ట్విస్టులు

  • Published Jul 20, 2022 | 12:35 PM Updated Updated Jul 20, 2022 | 12:35 PM
  • Published Jul 20, 2022 | 12:35 PMUpdated Jul 20, 2022 | 12:35 PM
సామ్ యశోదలో అసలు ట్విస్టులు

మాములుగా హీరోయిన్లు భర్తతో విడాకులు తీసుకున్నాక రకరకాల కారణాల వల్ల కెరీర్ స్లో అవ్వడం సహజం. ఇది దాదాపు అందరి విషయంలో జరిగిందే. కానీ దానికి భిన్నంగా సమంతా రివర్స్ లో వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇంతకు ముందు తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ దర్శకులు చెబుతున్న కథలను వింటోంది. ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడా శాకుంతలం లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తన ఖాతాలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ యూత్ హీరోలు సైతం సామ్ ని ఛాయస్ గా పెట్టుకోవడం డిమాండ్ ని సూచిస్తుంది

ముందుగా రాబోతున్న మూవీ మాత్రం యశోదనే. దశాబ్దాల క్రితం ఆదిత్య 369 లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆ మధ్య ఆగస్ట్ 12 రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగిన ఆలస్యం వల్ల వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హరీష్ హరిలు ఈ సినిమాకు జంట డైరెక్టర్లు. వరలక్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. ఊహించని ఒక సోషల్ మెసేజ్ ఉంటుందని యూనిట్ లీక్. దీని కథకు సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ కం షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఆసక్తి రేపేలా ఉంది

ఇందులో యశోద క్యారెక్టర్ ఓ అమాయకపు అమ్మాయి. తనలాంటి యువతులకు ప్రపంచానికి తెలియకుండా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుంటుంది. ఊహించని వలయంలో తన ప్రమేయం లేకుండానే చిక్కుకుంటుంది. శారీరకంగా కన్నా మానసిక సవాళ్లు ఎక్కువవుతాయి. వాటిని ఎలా దాటుకుంటుందనేదే మెయిన్ పాయింట్. అసలు ట్విస్ట్ ని దాచి ఉంచారు. మొత్తానికి సమంతాకు మరో ఛాలెంజింగ్ పాత్రే దొరికింది. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ థ్రిల్లర్ ని సెప్టెంబర్ రిలీజ్ కోసం చూస్తున్నారు కానీ డేట్లన్నీ లాక్ అయిపోవడంతో పోటీ లేకుండా సోలోగా వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ నోట్ రావాల్సి ఉంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet