iDreamPost
android-app
ios-app

సంవత్సరానికి పైగా సమంత ఆ కష్టాలను ఎలా భరించిందో..

సంవత్సరానికి పైగా సమంత ఆ కష్టాలను ఎలా భరించిందో..

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత గత ఒకటిన్నర సంవత్సరంగా మైయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వ్యాధి బారిన పడిన కొత్తలో ఆమె చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితిలో నరకం అనుభవించారు. చికిత్స తీసుకోవటం వల్ల కొద్ది కొద్దిగా ఆ వ్యాధినుంచి బయట పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె చాలా రకాల ఆహారాలను వదిలేయాల్సి వచ్చింది. వాటిలో ఆమెకు ఇష్టమైన ఆహారం కూడా ఉంది. ముఖ్యంగా గోధుమతో తయారు చేసిన వాటిని ఆమె తినటం తగ్గించింది.

బ్రెడ్డును పూర్తిగా తినటం మానేసింది. దాదాపు సంవత్సరం తర్వాత తాజాగా, ఆమె బ్రెడ్డు బట్టర్‌ తిన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత బెడ్డు ముక్కల్ని తింటున్నా’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న ఫ్యాన్స్‌, నెటిజన్లు.. సమంత ఇంతకాలం అనుభవించిన కష్టాన్ని తలుచుకుని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సమంత మరింత ఆరోగ్యంగా అవ్వాలని కోరుకుంటున్నారు.

Samantha health precautions

కాగా, సమంత మైయోసైటిస్‌ వ్యాధికి చికిత్స తీసుకోవటం కోసం దాదాపు ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు అమెరికాలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందుకే ఏ కొత్త సినిమాకు ఆమె సైన్‌ చేయలేదు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి ఫ్యాన్స్‌కు ఎప్పుడూ దగ్గరగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో ముందు కంటే యాక్టీవ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ ఉన్నారు. మరి,  సమంత ఈ సంవత్సర కాలం పడ్డ కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis