iDreamPost
android-app
ios-app

Sai Pallavi Gargi సాయిపల్లవి మీదే గార్గి భారం

  • Published Jul 12, 2022 | 11:57 AM Updated Updated Jul 12, 2022 | 11:57 AM
Sai Pallavi Gargi సాయిపల్లవి మీదే గార్గి భారం

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ హైప్ ఉన్నది ఒక్క రామ్ ది వారియర్ కు మాత్రమే. వర్షాలు టికెట్ రేట్ల వల్ల దాని బుకింగ్స్ కూడా ఏమంత జోరుగా లేవు. ఫ్రైడే సెంటిమెంట్ కి భిన్నంగా ఒక రోజు ముందే గురువారం రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ మూవీకి టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేదు. అయితే 15న వస్తున్న గార్గి మీద పెద్దగా అంచనాలేం లేవు కానీ ప్రమోషన్లు జరుగుతున్నాయి.

అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కున్న తండ్రి కోసం ఓ కూతురు చేసే పోరాటమే గార్గి కథలో మెయిన్ పాయింట్. దీని భారమంతా సాయిపల్లవినే మోస్తోంది. ఆమె తప్ప ఇందులో చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ లేదు. డబ్బింగ్ వెర్షనే అయినప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటూ పబ్లిసిటీలో భాగమవుతూ ఇంటర్వ్యూలు గట్రా గట్టిగానే ఇస్తోంది. విరాటపర్వంకు కూడా ఇంతే కష్టపడిన సంగతి మర్చిపోకూడదు.

కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు కొంత మిస్టరీ ఎలిమెంట్ ని డిస్కస్ చేసిన గార్గికి ఒకపక్క ఓపెనింగ్స్ పట్ల ఆందోళనతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కూడా టెన్షన్ కలిగిస్తున్నాయి. థియేటర్లకు జనం వస్తారా రారా అనే అనుమానాలు అంతకంతా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యునానిమస్ టాక్ వస్తేనే గార్గికి ప్లస్ అవుతుంది. గోవింద్ వసంత సంగీతమందించిన గార్గికి గౌతమ్ రామచంద్రన్ దర్శకుడు.

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet