iDreamPost
android-app
ios-app

విరాట పర్వం కోసం సాయి పల్లవి ఈ సాహసం చేసింది.. అవార్డు పర్ఫార్మెన్స్..

  • Published Jun 15, 2022 | 8:23 PM Updated Updated Jun 15, 2022 | 8:23 PM
  • Published Jun 15, 2022 | 8:23 PMUpdated Jun 15, 2022 | 8:23 PM
విరాట పర్వం కోసం సాయి పల్లవి ఈ సాహసం చేసింది.. అవార్డు పర్ఫార్మెన్స్..

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి క్రేజ్ మీదే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి గురించి, ఆమె క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో, ఇప్పుడు విరాటపర్వం ప్రమోషన్స్ లో ప్రతి సారి సాయిపల్లవి క్రేజ్ ప్రూవ్ అవుతూనే వస్తుంది.

విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టే నడుస్తుందని, సినిమాని సాయి పల్లవి కోణంలో చూపిస్తున్నారని, సాయి పల్లవి అద్భుతంగా నటించిందని డైరెక్టర్ వేణు, హీరో రానా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి సాయి పల్లవి గురించి మరో ఆసక్తికర విషయాన్నీ తెలిపారు డైరెక్టర్ వేణు. వేణు మాట్లాడుతూ.. విరాట పర్వంలోని ఒక సన్నివేశంలో సాయి పల్లవి పోషించిన పాత్రకు గందరగోళ సమయంలో 2 రోజుల పాటు ఆకలితో ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నట్టు యాక్ట్ చేయొచ్చు కానీ సాయి పల్లవి నటనని పూర్తిగా ప్రొఫెషనల్‌గా తీసుకొని ఆ సన్నివేశాన్ని ఆ పాత్రతో పండించడానికి సాయి పల్లవి నిజంగానే 2 రోజులు పూర్తిగా తినకుండా ఆకలితో ఉంది. సినిమా కోసం సాయి పల్లవి ఈ సాహసం చేసింది. ఆ సన్నివేశం చాలా బాగా వచ్చింది. సినిమా పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ అది. ఈ సినిమాలో సాయి పల్లవి అవార్డ్ పర్ఫార్మెన్స్ కి తగ్గ నటనని చూపించింది అని తెలిపాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet