iDreamPost
android-app
ios-app

Sai Pallavi: ఐటెం సాంగ్స్‌పై సాయి పల్లవి రియాక్ష‌న్

  • Published May 23, 2022 | 8:17 PM Updated Updated May 23, 2022 | 8:23 PM
  • Published May 23, 2022 | 8:17 PMUpdated May 23, 2022 | 8:23 PM
Sai Pallavi: ఐటెం సాంగ్స్‌పై సాయి పల్లవి రియాక్ష‌న్

Sai Pallavi On Item Songs: అంద‌రు హీరోయిన్లు ఒక‌వైపు సాయిప‌ల్ల‌వి మ‌రోవైపు. న‌ట‌న‌కే ఇంపార్టెన్స్, నో ఎక్స్ పోజింగ్, చిల్ల‌ర పాత్ర‌ల‌కు కోట్లిచ్చినా చేయ‌దు. అందం, అభినయంతో , డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్‌ చేస్తోంది ఈ నాచులర్‌ బ్యూటీ. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది.

త్వరలోనే విరాట పర్యం మూవీతో శ్యామ్ సింగ‌రాయ్ త‌ర్వాత క‌నిపించ‌నుంది. మూవీ ప్ర‌మోష‌న్ల వేళ ఐటెం, స్పెషల్‌ సాంగ్‌లపై ఆమెకు సూటి ప్రశ్న ఎదురైంది. రంగస్థలంలోని జిగేలు రాణి , పుష్ప మూవీలోని ఊ అంటావా మామ వంటి పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్ అడిగితే, అంత‌క‌న్నా క‌చ్చితంగా… చేయను అని బదులిచ్చింది. ఐటెం సాంగ్స్‌ నాకు కంఫర్ట్ గా ఉండ‌వు. వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాన‌ని మ‌రోసారి తేల్చేసింది.

ఎందుకు నో అంటోందో ఆమె క్లియ‌ర్ గా చెప్పింది. డ్రెస్సింగ్ బాగోలేక‌పోతే నాకు ఇబ్బంది. నేను కంఫర్ట్‌గా ఉండలేను. అందుకే అలాంటి స్పెషల్‌ సాంగ్‌లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు క్లారిటీ ఇచ్చింది. మ‌రి ల‌వ్ పై అభిప్రాయం ఏంటని అడిగితే కుర్రాళ్ల‌కు న‌చ్చే మాట చెప్పింది. జీవితానికి కెరీర్‌ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతేన‌ని తేల్చేసింది. రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాద‌ని సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. ప్ర‌స్తుతానికి మ‌రే ఇత‌ర సినిమాలో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌డంలేదు. రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్‌ కానుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom