గాంధీ కలల రాజ్యం – సచివాలయాలకు ప్రత్యేక శాఖ

జాతి పిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమవుతోంది. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటను ఏపీలో జగన్‌ సర్కార్‌ ఆచరణలో చూపిస్తోంది. గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రజలకు సమర్థవంతంగా పాలన అందించేందుకు ప్రతి రెండు వేల మందికి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు ప్రత్యేకంగా శాఖను జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఈ శాఖ పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ శాఖ పరిధిలోకి వస్తారు. సచివాలయాలను ఇతర శాఖలతో సమన్వయం చేసేందుకు ఈ శాఖ సమర్థవంతంగా పని చేస్తుంది. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు అవసరమైన శిక్షణ, వారి విధులు, బాధ్యతలు, జీత భత్యాలు, ప్రమోషన్లు తదితరాలు ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు నిధులు మంజూరు, అర్థవంతంగా వాటì ఖర్చుకు ప్రణాళకల తయారీ, అకౌంటింగ్‌ వంటి ముఖ్యమైన వ్యవహారాలను నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకే ఈ శాఖ బాధ్యతలను అప్పగించనున్నారు.

Show comments