బ్రిట‌న్ ను పాలించేది భార‌తీయుడే!

బోరిస్ జాన్సన్ స్థానంలో UK ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవ‌కాశ‌మున్న నాయ‌కుడు భారత సంతతికి చెందిన రిషి సునక్. వ‌రుస‌గా మంత్రులు రాజీనామా చేయ‌డంతో వివాద‌స్ప‌ద‌ బ్రిట‌న్ ప్రధాని బోరిస్ జాన్స‌న్ సాగ‌తీసి, సాగ‌తీసి చివ‌రకు ఆయ‌న రిజైన్ చేశారు.

అంత‌కుముందు మంత్రుల రాజీనామాల‌తో బోరిస్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి నచ్చ‌ని రిషి సున‌క్, ఇద్ద‌రు దారులు వేర్వేరు కాబ‌ట్టి రాజీనామా చేస్తున్నాన‌ని ట్వీట్ చేశారు.

ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. మ‌రి కొత్త ప్ర‌ధాని ఎవ‌రు? చాలా పేర్లు తెరమీద‌కొచ్చినా, భారత సంతతికి చెందిన రిషి సునక్‌, ముందున్న‌ట్లు అంచ‌నావేస్తున్నారు. ఆయ‌న ఇంత‌వర‌కు బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి. క‌రోనా స‌మ‌యంలో లోక‌ల్ బిజినెస్ దెబ్బ‌తిన‌కుండా రుషి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఆయ‌నే రెస్టారెంట్ల‌కెళ్లారు. బోరిస్ తీరు న‌చ్చ‌క పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత 54 మంది మంత్రులు తమ పద‌వుల‌ను వ‌దుల‌కున్నారు. పార్టీకూడా త‌ప్పుకోమ‌ని చెప్పేస‌రికి, అప్ప‌టిదాకా ఏదోలా గండం గట్టెక్క‌డానికి ప్రయ‌త్నించిన బోరిస్ ప్రధానిగా తప్పుకునేందుకు అంగీకరించారు.

రిషి సునక్ వయసు 42 ఏళ్లే. ఆర్ధిక శాఖ‌కు కార్య‌ద‌ర్శ‌గా ఉన్న ఆయ‌న‌ను 2020లో బోరిస్ తన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు.

కరోనా సంక్షోభ సమయంలో ఆయ‌న ప‌నితీరు బ్రిట‌న్ కు బాగా న‌చ్చింది. వ్యాపారులు, ఉద్యోగుల‌ కోసం వేల‌ కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చారు. కాని రిషిపై కొన్ని మ‌ర‌లున్నాయి. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఆస్తులు, ఫ్యామిలీ టాక్స్ విష‌యంలో కొన్ని ఆరోప‌ణ‌లు ఆయ‌న‌కు ఇబ్బంది. కాని ఆయ‌న రాజీనామా చేయ‌డంతోనే ఆయ‌న ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీదారునిగా మారారు. కాక‌పోతే, కోవిడ్ సంక్షోభ‌స‌మ‌యంలో ఆయ‌న జీవ‌న వ్య‌యం పెరుగుతున్న‌స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డానికి మొద‌ట్లో ఇష్ట‌ప‌డ‌లేదు.

రిషి తాత‌ముత్తాత‌లు పంజాబ్‌కు చెందినారు. రిషి బ్రిట‌న్ లోనే పుట్టిపెరిగారు. ఆయ‌న భార్య‌ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తి. ఆమె భార‌తీయురాలే. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిషి బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికైతే అది గొప్ప చ‌రిత్రే. భార‌తదేశాన్ని ఏలిన బ్రిట‌న్ కు ప్ర‌ధాని కావ‌డ‌మంటే ఒక పెద్ద సినిమాకు కావాల్సిన ముడిస‌రుకు దొరికిన‌ట్లే.

ఇంకోసంగ‌తి రిషి ఆస్తుల విలువ బ్రిట‌న్ రాణి క‌న్నా ఎక్కువే.

Show comments