iDreamPost
android-app
ios-app

రవి తేజ మంచి మనసు గురించి చెప్పిన రేణు దేశాయ్‌!

రవి తేజ మంచి మనసు గురించి చెప్పిన రేణు దేశాయ్‌!

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాతో యాక్టింగ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు రేణు దేశాయ్‌. ఈ సినిమాలో పవర్‌ ఫుల్‌ పాత్రలో నటించారు. ఈ పాత్రలో రేణు దేశాయ్‌ నటించడానికి చిత్ర హీరో రవితేజ కూడా ఓ బలమైన కారణమట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయే చెప్పుకొచ్చారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రవితేజకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో  రేణు దేశాయ్‌ మాట్లాడుతూ.. ‘‘ ఓ విషయంలో రవితేజ గారిని మెచ్చుకోవాలి. నేను మొట్టమొదట పబ్లిక్‌లోనే ఈ విషయం చెప్పాలనుకున్నాను.

కానీ, ఇప్పుడే చెప్పేస్తున్నా.. 2019లోనే నేను ఈ సినిమాకు సైన్‌ చేశాను. ఆ సినిమాకు రవితేజ గారు సైన్‌ చేయగానే.. మా దర్శకుడు నాకు ఫోన్‌ చేశారు. నేను వంశీని ఒక్కటే అడిగాను. ‘నేను ఇంకా ఉన్నానా? సినిమాలో’ అన్నాను. ఆయన ఏంటి రేణు గారు భలే అంటున్నారు అన్నాడు. ఆయనకు ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఈక్వేషన్స్‌ ఉంటాయి. నా మాజీ భర్త విషయం కూడా. కానీ, ఆ రోల్‌ నేనే చేయాలని రవి తేజ పట్టుబట్టారు. నాకు చాలా మద్దతుగా నిలిచారు.

గతంలో కొన్ని సినిమాలు నా దగ్గరికి వచ్చాయి. చివరి నిమిషంలో నన్ను వద్దునుకున్నారు. నేను డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, నూటికి నూరు శాతం రవితేజ గారికి కృతజ్ఞురాలిని. రవి తేజగారు నా వైపు నిల్చున్నారు’’ అని అన్నారు. కాగా, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. రవితేజ సరసన నుపుర్‌ సింగ్‌ నటించారు. ఇక, ఈ సినిమా అక్టోబర్‌ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet