iDreamPost
android-app
ios-app

విడాకులు వరల్డ్‌ ఫేమస్‌.. ఆయన గురించి మాట్లాడను: రేణు దేశాయ్‌

విడాకులు వరల్డ్‌ ఫేమస్‌.. ఆయన గురించి మాట్లాడను: రేణు దేశాయ్‌

చాలా  ఏళ్ల తర్వాత మళ్లీ నటన వైపు వచ్చారు ‘రేణు దేశాయ్‌’. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో ఆమె ఎంతో ప్రాధాన్యత గల పాత్ర చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల గురించి మాట్లాడారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. రేణు దేశాయ్‌ మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడి ట్రబుల్‌లో పడలేనన్నారు.

ఆయన గురించి మాట్లాడి.. తిట్టేవాళ్లకి అవకాశం ఎందుకు ఇవ్వాలని, మాట్లాడకుండా ఉండటమే మంచిదని అన్నారు. ఆయన గురించి మాట్లాడాలంటే ఆయనే మాట్లాడాలని స్పష్టం చేశారు. లైఫ్ అంటే ఈజీ కాదని.. అందరికీ సమస్యలు ఉంటాయని అన్నారు. అందరూ డోర్ వెనుక ఉండి ఏడ్చేవాళ్లేనని పేర్కొన్నారు. డబ్బు వల్ల జాయ్, సెక్యురిటీ ఉంటుందేమో కానీ.. ప్రాబ్లమ్ లేకుండా ఉండదని స్పష్టం చేశారు. డబ్బు వల్ల సంతోషం ఉంటుందని అనటం నిజం కాదన్నారు.

తన విడాకుల ఇష్యూ అయితే వరల్డ్ ఫేమస్ అని అన్నారు. తాను విడాకులు తీసుకున్న పీరియడ్ తన లైఫ్‌లో చాలా విషాదకర సమయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తాను యాక్టర్‌ని మాత్రమేని, ఇప్పుడు స్పెక్టేటర్ కూడా అని అన్నారు. ఇలా తన లైఫ్‌లో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయంటూ ఎమోషనల్‌ అయ్యారు. కాగా, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో రవితేజ, నుపుర్‌ సనన్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet